Hyderabad : మెడికవర్ హాస్పటల్ లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.!
Hyderabad : మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో జూనియర్ డాక్టర్ నాగప్రియ జాయిన్ అయ్యింది. కాగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది
- By Sudheer Published Date - 01:51 PM, Wed - 6 November 24

డబ్బుల కోసం కక్కుర్తి పడే కొన్ని కార్పోరేట్ హాస్పటల్స్ .. శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజుతుంటాయనే సంగతి తెలిసిందే. పేషెంట్ చనిపోయాడన్న విషయాన్ని దాచిపెట్టి.. ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి లక్షల కొద్ది డబ్బులు గుంజుతున్నాయి. ఇలా ఒకటి రెండు కాదు ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లోని హాస్పటల్స్ కూడా ఇదే దందా చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో ఆస్పత్రి సన్నివేశాన్ని (Tagore Medical Scene) ప్రజలెవ్వరూ మర్చిపోలేరు. ఆస్పత్రి మాఫియాను కళ్లకు కట్టినట్టు సినిమాలో చూపిస్తారు. అయితే.. అలాంటి మాఫియాలు అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జనాల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వైద్యులు.. సినిమాలో చూపించినట్టుగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్ (Madhapur) లోని మెడికవర్ హాస్పటల్ (Medicover Hospital) లో ఠాగూర్ సినిమా తరహా సన్నివేశమే చోటుచేసుకుందని బాధితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అయితే.. సినిమాలో చనిపోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేసినట్టు నటించి డబ్బులు దండుకుంటే.. ఇక్కడ మాత్రం పేషంట్ పరిస్థితి విషమంగా ఉందని నానా రకాల పరీక్షలు పేరుతో డబ్బులు గుజరనేది బాధితుల వాదన.
మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో జూనియర్ డాక్టర్ నాగప్రియ (Nagapriya) జాయిన్ అయ్యింది. కాగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది..ఆ విషయం డాక్టర్స్ చెప్పకుండా..డబ్బులు ఇస్తేనే చికిత్స చేస్తామని చెప్పి..డబ్బులు కట్టించుకున్నారు. ఆ తర్వాత ఆమె మృతి చెందిందని చెప్పడం తో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు కడితేనే వైద్యం కొనసాగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం నిన్న చెప్పారని, ఈరోజు ఉదయం రూ. లక్ష కట్టించుకున్నారని, డబ్బులు చెల్లించాక ఆమె మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పారని, తమ బిడ్డ మృతి చెందిన విషయం దాచి ఫీజు వసూలు చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Also : US Presidential Elections : అమెరికన్లకు స్వర్ణయుగమే – డొనాల్డ్ ట్రంప్