T SAT : ఆంగ్లంలోనూ గ్రూప్-1 పాఠ్యాంశ ప్రసారాలు చేస్తున్న టి-సాట్
ఆగస్టు ఒకటవ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు మేయిన్స్ పరీక్ష కోసం ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రసారం చేస్తుందన్నారు
- By Sudheer Published Date - 03:43 PM, Sat - 31 August 24

తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్పీ (TGPSC) ఆధ్వర్యంలో గ్రూప్-1 (Group 1) పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆంగ్ల భాషలోనూ డిజిటల్ పాఠ్యాంశ ప్రసారాలు అందిస్తున్నట్లు సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం సుమారు 1200 గంటల తెలుగు పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేసిన టి-సాట్ ఆగస్టు ఒకటవ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు మేయిన్స్ పరీక్ష కోసం ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రసారం చేస్తుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం క్రాష్ కోర్స్ 100 అరగంట నిడివిగల పాఠ్యాంశ భాగాలను సెప్టెంబర్ ఒకటన తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రసారం చేస్తున్నట్లు సీఈవో వివరించారు. టి-సాట్ నిపుణ ఛానల్ లో తెల్లవారు జామున నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు విద్య ఛానల్ లో పాఠ్యాంశాలు పున:ప్రసారం అవుతాయని వేణుగోపాల్ రెడ్డి వెళ్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఆదరణను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్రసారాలు చేస్తున్నామని, ఆంగ్లంలో పరీక్షలు రాసే అభ్యర్థులు టి-సాట్ పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి కోరారు.
Read Also : Vinesh Phogat : రైతులను విస్మరిస్తే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది : వినేష్ ఫోగట్