Swiggy Dineout: హైదరాబాద్ ఓటర్లకు భారీ ఆఫర్.. భోజన ప్రియులకు పండగే
రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉత్తమంగా ప్రయత్నిస్తోంది స్విగ్గీ డైనవుట్. మే 13, పోలింగ్ రోజున హైదరాబాద్ వాసులు తమ సిరా గుర్తు ఉన్న వేలిని చూపించి ఎంపిక చేసిన రెస్టారెంట్లలో 50% వరకు తగ్గింపును పొందవచ్చు.
- By Praveen Aluthuru Published Date - 10:21 AM, Sun - 12 May 24

Swiggy Dineout: రేపు మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోకసభ ఎన్నికలు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ సొంత ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే బస్టాండు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నాయి. మరోవైపు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ తీవ్ర కసరత్తు చేస్తుంది. కాగా భోజనప్రియులు ఓటేసి కేవలం 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది అంటూ వినూత్న ప్రచారానికి తెరదించింది స్విగ్గీ డైనవుట్.
రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉత్తమంగా ప్రయత్నిస్తోంది స్విగ్గీ డైనవుట్. మే 13 పోలింగ్ రోజున హైదరాబాద్ వాసులు తమ సిరా గుర్తు ఉన్న వేలిని చూపించి ఎంపిక చేసిన రెస్టారెంట్లలో 50% వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేరా కిచెన్ అండ్ బార్(Antera Kitchen and Bar), పాపయ్య (PaPaYa), ఎయిర్ లైవ్ (Air Live), ఫుడ్ ఎక్స్ చేంజ్ (Food Exchange), నోవొటెల్ (Novotel), లే మెరిడియన్ (Le Meridien Hyderabad), కాఫీ కప్ (Coffee Cup) ఇలా తదితర రెస్టారెంట్లలో 50% వరకు తగ్గింపును పొందవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఎన్నికల కారణంగా డ్రై డేగా ఉండబోతున్నందున ఏ రెస్టారెంట్‌లోనూ మద్యం అందించబడదు. దీంతో భోజనంలో ప్రత్యేక తగ్గింపు ధరలతో ఓటింగ్ శాతాన్ని పెంచుతున్నారు. స్విగ్గీ డైనవుట్ మరియు స్థానిక రెస్టారెంట్లు ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడం మరియు హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Also Read: New Coach: టీమిండియాకు త్వరలో కొత్త కోచ్..?