HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Supreme Court Refused To Grant Bail To Brs Mlc Kavitha In Delhi Liquor Scam Case

MLC Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ, ఈడీల స్పందనను సుప్రీంకోర్టు అడిగింది. అయితే సీబీఐ మాత్రం తమ స్పందనను కోర్టుకు తెలియజేసింది. 

  • By Pasha Published Date - 11:37 AM, Tue - 20 August 24
  • daily-hunt
MLC Kavitha remand extended for another 14 days

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈసారైనా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందని అందరూ భావించారు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఇవాళ కూడా మరోసారి వాయిదా వేసింది. వచ్చే మంగళవారం దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ, ఈడీల స్పందనను సుప్రీంకోర్టు అడిగింది. అయితే సీబీఐ మాత్రం తమ స్పందనను కోర్టుకు తెలియజేసింది.  ఇక ఈడీ మాత్రం తమ స్పందనను తెలియజేసేందుకు కాస్త సమయం కావాలని అడిగింది. దీంతో గురువారం (ఈనెల 23)లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join

శుక్రవారంలోగా కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. కవిత(MLC Kavitha) పిటిషన్‌పై వచ్చే మంగళవారం (ఆగస్టు 27న) విచారణ జరుపుతామని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం వెల్లడించింది. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు.

Also Read :Doctor Murder : జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం.. కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై అవినీతి కేసు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఆమె గత ఐదు నెలలుగా ఢిల్లీలోని తిహార్ జైలులోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ పాలసీ విషయంలో తనపై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను  జూలై 1న ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులలో వరుసగా ఊరట లభించకపోవడంతో నేరుగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కవిత ఆశ్రయించారు. ప్రతివాదుల వాదనలు వినకుండా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also Read :Trump – Musk : అధ్యక్షుడినైతే కీలక పదవిని ఇస్తానన్న ట్రంప్.. మస్క్ స్పందన ఇదీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Delhi Liquor scam
  • kavitha
  • MLC Kavitha
  • Supreme Court

Related News

Kavitha

Kavitha : హరీశ్ రావుపై మరో అవినీతి బాంబ్ పేల్చిన కవిత..!!

Kavitha : వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టూ కొత్త వివాదం చెలరేగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఈ ప్రాజెక్టు అమలులో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు

  • CM Revanth

    Jubilee Hills Bypoll : హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

  • Congress

    Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఫలితం ఏంటో తెలిసే KCR ప్రచారం చేయలేదు – సీఎం రేవంత్

  • Maganti Sunitha

    Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

Latest News

  • Pregnant Women: గర్భధారణ సమయంలో ఆఫీస్‌లో పనిచేసే మహిళలు ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

  • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

  • DSP Richa: భారత క్రికెట్ జట్టు నుంచి మ‌రో కొత్త డీఎస్పీ!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి

  • AR Rahman Concert : రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన రెహమాన్‌ కాన్సర్ట్‌

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd