HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Supreme Court Issued Notice To Cm Revanth Reddy Vote For Note Case

Vote for Note Case : CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

  • Author : Sudheer Date : 09-02-2024 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sc Notice Revanth
Sc Notice Revanth

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సుప్రీం కోర్ట్ (Supreme Court ) భారీ షాక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసు (Vote for Note Case)లో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు (Supreme Court Issued Notice) జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

ఓటుకు నోటు కేసులో A-1 నిందితుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ సరిగా సాగే అవకాశం లేదని పిటషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ .. పిటీషన్ లో పలు ఉదంతాలను కూడా ఉదాహరించటం గమనార్హం. కాగా.. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని పిటీషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి..గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బెయిల్ మీద రేవంత్ రెడ్డి బయటకు రాగా… తర్వాత జరిగిన పరిణామాలతో ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది. అయితే.. మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

Read Also : Ravindra Jadeja : కోడలిపై జడేజా తండ్రి సంచలన ఆరోపణలు…రచ్చకెక్కిన క్రికెటర్ కుటుంబ విభేదాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Supreme Court
  • Supreme Court Notice
  • Vote for Note Case

Related News

Supreme Court allows passive euthanasia for Harish Rana

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

Supreme Court Allows Passive Euthanasia For Harish Rana  గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటం

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd