Viral : కరీంనగర్ జిల్లాలో వింత జీవులు కలకలం..భయాందోళనలో ప్రజలు
ఇలాంటి వింత జీవులను గ్రామంలో గతంలో ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు చెప్పుకొచ్చారు
- By Sudheer Published Date - 01:10 PM, Wed - 13 September 23

ప్రకృతి ఎంతో అందమైంది..నింగి, నేల, నీరు ఇలా ప్రతి చోటా అందాలతో పాటు ఏవో వింత సంఘటనలు చేసుకుంటుంటాయి. ఇప్పటివరకు ఎవరూ చూడని వింత జంతువులు దర్శనం ఖంగారుకు..ఆశ్చర్యానికి.. భయానికి గురిచేస్తునాటి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన పరిసరాల్లోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ (Karimnagar ) జిల్లాలో వింత జీవులు సందడి చేశాయి.
జిల్లాలోని గంగాధర మండలం భూర్గుపల్లి (Bhurgupalli )చెరువు కట్టపై కొన్ని వింత జంతువులను స్థానికులు గుర్తించారు. గ్రామ చెరువు కట్ట మైసమ్మ వద్ద దూలం కృష్ణ (Dulam Krishna) అనే వ్యక్తి తన పొలం వద్ద పాడి గేదెలకు మేత వేస్తుండగా చెరువు కట్ట వద్ద 10 నుంచి 15 వరకు ఉన్న వింత జీవులు (Pond Embankment)కనిపించడంతో భయాందోళనకు గురి అయ్యాడు. వెంటనే ఈ విషయాన్నీ గ్రామస్తులకు తెలిజేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్థులు వాటిని వింతగా చూడడం చేసారు.
Read Also : Inspections : రాజమండ్రి సెంట్రల్ జైల్లో అర్ధరాత్రి తనిఖీలు..ఏం జరగబోతుంది..?
ఇలాంటి వింత జీవులను గ్రామంలో గతంలో ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. పొలాల్లోకి వెళ్తే తమపై ఎక్కడ దాడులు చేస్తాయో అని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వింత జంతువులు ఎక్కడ గ్రామంలోకి ప్రవేశిస్తాయని భయపడుతూ.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకుని వాటిని పట్టుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వింత జంతువుల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన వారు నీటి కుక్కలుగా అని అంటున్నారు. మరి ఇవి అవేనో కాదో తెలియాల్సి ఉంది.