HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Story Behind Chintamaneni Pabhakar Cock Fights Issue

Chintamaneni : కోడిపందెం వెనుక పెద్ద స్కెచ్

మాజీ ఎమ్మెల్మే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కోడిపందెం వ్య‌వ‌హారం మ‌లుపులు తిరుగుతోంది.

  • Author : CS Rao Date : 08-07-2022 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chintamaneni Cock Fights
Chintamaneni Cock Fights

మాజీ ఎమ్మెల్మే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కోడిపందెం వ్య‌వ‌హారం మ‌లుపులు తిరుగుతోంది. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి తెలంగాణ పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా ప‌టాన్ చెరువు కేంద్రంగా జ‌రిగిన కోడిపందెం వ్య‌వ‌హారంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పే ప్ర‌భాక‌ర్ ప‌టాన్ చెరువు కోడిపందెం వ‌ద్ద‌కు వెళ్లింది నిజ‌మేన‌ని అంగీక‌రించారు. అంతేకాదు, కోడిపందెం త‌న వ్య‌స‌నం అంటూ వెల్ల‌డించారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న ప్ర‌త్య‌ర్థులు కోడి పందేలు ఆడుతాననే విషయం రెండు రాష్ట్రాల ప్రజలకు, మీడియాకు, పోలీసులకు తెలుసని ఆయన చెప్పారు.

కోడిపందేల కోసం తాను కర్ణాటకకు, పటాన్ చెరుకు వెళ్లింది నిజమేనని చెప్పారు. అయితే కోడిపందేలు చట్టం దృష్టిలో నేరం కాబట్టి పోలీసులు వస్తున్నారని సమాచారం అందగానే అక్కడి నుంచి క్షేమంగా తప్పుకున్నానని వివ‌ర‌ణ ఇచ్చారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ, బలహీనతను చంపుకోలేక అక్కడకు వెళ్లానని చింతమనేని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. పోలీసులు వచ్చే సమయానికి తాను అక్కడ లేనని, అంతకు ముందు తీసిన ఫొటోలను, వీడియోలను మీడియాకు పోలీసులు లీక్ చేశారని అన్నారు. కోడిపందేలను నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం తనకు లేదని వివ‌రించారు.

కర్ణాటకలో కోడిపందేలకు వెళ్లి వస్తుండగా, భోజనానికి పిలిచారని తనను ఇరికించడానికి ఇంత పెద్ద స్కెచ్ వేశారని చింతమనేని చెబుతున్నారుర‌. అయితే దొరకకుండా వ్యూహాత్మ‌కంగా త‌ప్పుకున్నాని చెప్పారు. ఈ కేసులో నిందితులకు 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టిందని చెప్పారు. పటాన్ చెరులో జరిగిన కోడిపందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారనే వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి చింతమనేని పారిపోయారని, ఆయన కోసం గాలిస్తున్నామని పటాన్ చెరు డీఎస్పీ చెప్పారు. ఈ క్రమంలో చింతమనేని స్పందిస్తూ వివ‌ర‌ణ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chintamaneni prabhakar
  • cock fights
  • hyderabad
  • telangana police

Related News

Rowdy Sheeter Rapes A Minor

మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Hyd Parking

    Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

  • Fire in Meerut

    HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !

Latest News

  • Gold Price Today 20 Feb 2026 : మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర

  • తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

  • కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

  • సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ

  • ఏపిలో టీవీ సౌండ్‌ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd