Sridhar Babu Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఈయన కు కాంగ్రెస్ ఆర్ధిక శాఖ బాధ్యతను అప్పగించింది
- Author : Sudheer
Date : 07-12-2023 - 4:11 IST
Published By : Hashtagu Telugu Desk
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఈయన కు కాంగ్రెస్ ఆర్ధిక శాఖ బాధ్యతను అప్పగించింది. శ్రీధర్‌బాబు 1969 మార్చి 9, లో జన్మించారు. అతని ప్రముఖ కాంగ్రెస్‌నేత, శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మల మూడవ కుమారునిగా జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1999లో తండ్రి హత్య జరగడంతో ఆయన రాజకీయ వారసునిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కొనసాగుతున్నారు. శ్రీధర్‌బాబు శైలజ రమ్యర్‌ను వివాహం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హాండీక్రాఫ్ట్స్ దేవ్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఆమె వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. అతను ఇప్పుడు తెలంగాణలో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంథని నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను శాసన సభ్యునిగా ఆయన నాలుగోసారి గెలుపొందాడు. శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో ఒకడు. అతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగము ఉపాధ్యక్షులలో ఒకడు. శ్రీధర్ మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
Read Also : Komatireddy Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి