Nallu Indrasena Reddy : త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్
రెండు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిపుర, ఒడిశాలకు గవర్నర్‌లను
- Author : Prasad
Date : 18-10-2023 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
రెండు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిపుర, ఒడిశాలకు గవర్నర్‌లను నియమించింది. ఇందులో తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించారు. త్రిపురతో పాటు ఒడిశా కూడా కొత్త గవర్నర్‌ని నియమించారు. జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్‌ని ఒడిశా గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణకి చెందిన నల్లు ఇంద్రసేనా రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మూడు సార్లు ఆయన బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 లో తొలిసారిగా మలక్‌పేట నియోజకవర్గం నుంచి గెలిచారు. 1985, 1999లో కూడా ఆయన గెలిచారు. బీజేపీలో అనేక పదవులను ఆయన పొందారు. 1999లో అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించడం పట్ల బీజేపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: World Cup : న్యూజిలాండ్ జైత్రయాత్ర.. ఆప్ఘనిస్తాన్‌పై గెలుపుతో టాప్ ప్లేస్