HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sorry Bapu Eyes On Maharashtra Again

Kcr: పాపం బాపూ…మళ్లీ మహారాష్ట్రపై కన్ను

దేశంలో చక్రం తిప్పుదాం అనుకుంటే.. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. ఆంధ్రప్రదేశ్లో షట్టర్లు బిగించారు. తమిళనాడులో స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు.

  • By manojveeranki Published Date - 02:58 PM, Wed - 29 May 24
  • daily-hunt
Sorry Bapu...eyes On Maharashtra Again
Sorry Bapu...eyes On Maharashtra Again

Kcr: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన బీఆర్ఎస్(BRS) అలియాస్‌ టీఆర్ఎస్‌(TRS)కి…. జన్మస్థానంలోనే ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అయితే… అసెంబ్లీ ఎన్నిల్లో(Assembly Elections) ఓటమి తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదేమోనని… ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. లోక్‌సభ ఫలితాల(Loksabha Results) తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధినేత ఎప్పుడో గుర్తించారు. దీంతో… దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. పక్క రాష్ట్రం మహారాష్ట్ర(Maharashtra)పై మళ్లీ ఫోకస్ పెట్టారు.

దీంతో… తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌(BRS) పరిస్థితిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమతి.. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టింది. దేశంలో చక్రం తిప్పుదాం అనుకుంటే.. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. ఆంధ్రప్రదేశ్లో షట్టర్లు బిగించారు. తమిళనాడులో స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు. బీహార్లో నితీష్ కుమార్(Nithish Kumar) బిజెపి వైపు వెళ్లిపోయాడు. కర్ణాటకలో కుమారస్వామి (Kumara Swamy) భవితవ్యం ఏమిటో తెలియడం లేదు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ (Hemanth Soren) ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. చేయి కలిపిన పాపానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్(Delhi Cm Kejriwal) జైలు కూడు తిని వచ్చాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కు ఎదురైన వైఫల్యాలు.. తగిలిన దెబ్బలు మామూలివి కావు.

చివరికి కన్న కూతురు కవిత (Kavitha)కూడా లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్ళింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ కు సాంత్వన కావాలి. అలాంటి సాంత్వన ఇచ్చే నాయకుడు భారత రాష్ట్ర సమితిలో లేడని చాలామంది అంటారు. అప్పట్లో కేశవరావు (KeshavaRao) నీడలాగా ఉండేవాడు. అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ నీడను వెతుక్కుంటూ వెళ్ళాడు. తెలుగు వారు ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయడానికి కసరత్తు చేస్తోంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా మొదలు కానుంది. అయితే, బీఆర్‌ఎస్‌ వీటిపై కాకుండా అసెంబ్లీ స్థానాలపైనే దృష్టి పెట్టాలని భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేపట్టిన గులాబీ బాస్‌ అక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ప్రారంభించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత, లోక్‌సభ ఎన్నికల ముందు ఆ నేతలంతా తమదారి తాము చూసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. మళ్లీ కొత్త నేతలు వస్తారని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు.. బీఆర్‌ఎస్‌ (BRS) పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇంట ఓడిపోయి.. రచ్చ గెలవాలని చూస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌. గులాబీ బాస్‌(KCR) తీరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ భవిష్యత్‌ ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో కేసీఆర్‌ మహారాష్ట్ర(Maharashtra)పై దృష్టిపెట్టడం, అక్కడ సత్తా చాటాలని పాకులాడడంపై గుసగుసలాడుతున్నారు. కేసీఆర్‌ తీరుతో తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని పేర్కొంటున్నారు. అయితే కొందరు మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం వెనక ఏదో ఎత్తుగడ ఉండే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. షిండే సార్కర్‌కు మద్దతుగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే కేసీఆర్‌ మహారాష్ట్రపై దృష్టిపెట్టారని ప్రచారం జరుగుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • Maharashtra brs
  • Maharashtra politics

Related News

KCR appearance before Kaleshwaram Commission postponed

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

KCR : “కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ప్రధాని మోదీ చెప్పాలి” – అనే మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి

  • SLBC Tunnel Incident

    SLBC Tunnel Collapse : ‘SLBC టన్నెల్ కూలిపోవడానికి కేసీఆరే కారణం’ – సీఎం రేవంత్ రెడ్డి

  • Kishan Reddy Delhi Bjp National Chief Telangana Bjp Chief Parliament Session Waqf Bill

    Kishan Reddy on Jubilee Hills by Election : జూబ్లిహిల్స్ బై పోల్ వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Kcr Nxt Cm

    KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా

Latest News

  • Blood Pressure: రాత్రిపూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?

  • Zodiac Signs: కర్ణుడి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఈ రాశుల‌వారిలోనే ఉంటాయ‌ట‌!

  • Parliament Winter Session: పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి హీట్ పెంచ‌బోతున్నాయా?

  • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

  • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

Trending News

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd