Telangana : తెలంగాణ హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు ఈ రోజు(మంగళవారం) ప్రమాణ స్వీకారం చేశారు
- Author : Prasad
Date : 16-08-2022 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు ఈ రోజు(మంగళవారం) ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. ఇ.వి. వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజా శరత్, జె.శ్రీనివాసరావు, ఎన్.రాజేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అదనపు న్యాయమూర్తులుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. సీనియారిటీ ప్రకారం అదనపు న్యాయమూర్తులు రెండేళ్ల తర్వాత శాశ్వత న్యాయమూర్తులు అవుతారు. దీంతో హైకోర్టులో మంజూరైన 42 పోస్టులకు గాను ఇద్దరు అదనపు న్యాయమూర్తులతోపాటు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది.
ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం మేరకు తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 12న నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 25న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు ఈ నియామకం జరిగింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దాదాపు 2.4 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
Chief Justice Ujjal Bhuyan Administers oath of office to 6 newly appointed Judges/Additional Judges of Telangana High Court.#TelanganaHighCourt #OathCeremony pic.twitter.com/OeqIo9XVTN
— The Court & Law (@TheCourtAndLaw) August 16, 2022
SIX