Minister Seethakka : సీతక్కకు హోమంత్రి..?
ప్రస్తుతం స్త్రీ, శిశు అభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క బాధ్యతలు నిర్వహిస్తుంది
- Author : Sudheer
Date : 01-07-2024 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న విషయం తెలిసిందే. పలు శాఖలకు సంబంధించి ఇంకా ఖాళీలు ఉండడం తో వాటిని పూర్తి చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తుంది. బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన పలువురికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న పలువురు మంత్రుల శాఖలు సైతం మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురి మంత్రుల శాఖలు సైతం మారే అవకాశాలున్నాయన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్‌రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని, రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయన్నారు. 2018 ఎన్నిలకు ముందు ప్యారాషూట్లకు టికెట్లు లేవని రాహుల్ గాంధీ చెప్పారని.. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. త్వరలో వైద్యశాఖలో ప్రక్షాళన, సంస్కరణలు తీసుకువస్తామన్నారు.
ప్రస్తుతం స్త్రీ, శిశు అభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క (Minister Seethakka) బాధ్యతలు నిర్వహిస్తుంది. హోంశాఖ రేవంత్ దగ్గరే ఉండటంతో తనకు అత్యంత సన్నిహితురాలైన సీతక్కకు కీలకమైన ఈ శాఖను ఇవ్వాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా మహిళకే హోంశాఖను ఇచ్చినట్లుగానే.. ఇప్పుడు రేవంత్ కూడా అదే సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also : Medigadda Barrage : ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది – కేటీఆర్