HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Siricilla Needs To Support The Handloom Workers Bandi Requests To Revanth

Bandi Sanjay: సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి, రేవంత్ కు బండి రిక్వెస్ట్‌

  • Author : Balu J Date : 18-01-2024 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dark Politics
Ktr Revanth, Bandi Imresizer

Bandi Sanjay: ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్‌టైల్‌పార్క్‌)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు.

ఈ ప్రాంతంలో మొత్తం 33 వేల మరమగ్గాలుండగా, ఇందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రాలు, 5 వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయని తెలిపారు. ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్ పెట్టారని గుర్తుచేశారు. దీనికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే.

గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోందని.. వస్తోత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.220 కోట్లను బకాయి పెట్టిందని ఆరోపించారు బండి సంజయ్. ఈ బకాయిలు రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బకాయిలను చెల్లిస్తామని అప్పటి మంత్రి, స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పలుమార్లు హామీ ఇచ్చినా చెల్లించలేదన్నారు. చివరకు ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి బకాయిలు చెల్లించలేదన్నారు. రేవంత్ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి ఆదుకోవాల‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • cm revanth
  • Rajanna Siricilla

Related News

Cm Revanth Good News

Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

18 ఏళ్లు నిండిన అర్హులైన విద్యార్థినులకు ఈ స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారి ఉన్నత చదువులకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, త్వరలోనే దీనిపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించి

  • There Will Be No Urea Probl

    Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!

  • Telangana Congress Nominate

    Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

  • Revanth Vem

    Rajyasabha : వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్..? సీఎం రేవంత్ మాట నెగ్గుతుందా ?

  • Telangana Congress Govt Sch

    Govt Schemes : వారందరికీ ప్రభుత్వ పథకాలు కట్ – కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!

Latest News

  • Bigg Boss Demon Pavan: డెమాన్ పవన్ ఇంట విషాదం..శోకసంద్రంలో రీతూ

  • Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

  • Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

  • నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Trending News

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd