Gold Saree : చేనేత కార్మికుడి అద్భుతం – 200 గ్రాముల బంగారంతో చీర
Gold saree : సిరిసిల్ల (Siricilla )కు చెందిన విజయ్ కుమార్ (Vijay Kumar) ఓ వ్యాపారవేత్త కూతురి వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీరను సిద్ధం చేసి వార్తల్లో నిలిచారు
- By Sudheer Published Date - 07:34 PM, Sat - 28 September 24

Sircilla Weaver Made Saree with Gold : అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారుచేసి అబ్బురపరిచిన తెలంగాణ చేనేత కళాకారులు ఇప్పుడు మరో అద్భుతం సృష్టించి వార్తల్లో నిలిచారు. సిరిసిల్ల (Siricilla )కు చెందిన విజయ్ కుమార్ (Vijay Kumar) ఓ వ్యాపారవేత్త కూతురి వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీరను సిద్ధం చేసి వార్తల్లో నిలిచారు.
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ వ్యాపారవేత్త (Business Man) 200 గ్రాముల బంగారం (200 Grams Gold Saree )తో చీర తయారు చేయాలని..సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ కోరారు. దీనికి సరే అని చెప్పిన విజయ్..200 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ చీర 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు, బరువు 800 నుంచి 900 గ్రాములు ఉందట. అక్టోబర్ 17వ తేదీన తన కుమార్తె వివాహానికి ఆ వ్యాపారవేత్త ఈ చీరను తయారు చేయిస్తున్నట్లు చెప్పారు. దీన్ని తయారు చేసేందుకు రూ.18 లక్షలు ఖర్చైందని.. బంగారంతో చీర తయారు చేయడం తనకెంతో సంతోషంగా ఉందని విజయ్ తెలిపారు. చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితమే ఆర్డర్ వచ్చిందని విజయ్, బంగారాన్ని జరిపోవులు తీయడానికి, కొత్త డిజైన్ తయారు చేయడానికి పది నుంచి 12 రోజులు పట్టిందని ఆయన పేర్కొన్నారు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్లా విజయ్ కుమార్, బంగారు చీరలను మాత్రమే కాకుండా రంగులు మారే త్రీడీ చీరను సైతం రూపొందించారు. శ్రీరామనవమి(Sri Rama Navami 2024) సందర్భంగా భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఈ త్రీడీ చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువు ఉంటుంది. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో త్రీడీ చీరను తయారు చేశానని విజయ్ తెలిపారు.
Read Also : Manchu Vishnu : సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?