CS Shantha Kumari: తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి!
తెలంగాణ సీఎస్ గా శాంతకుమరి (Shantha Kumari) ని నియమించారు
- By Balu J Published Date - 03:38 PM, Wed - 11 January 23

సోమేష్ కుమార్ (Somesh Kumar) స్థానంలో తెలంగాణ ఛీఫ్ సెక్రటరీగా 1989 బ్యాచ్ కు చెందిన ఏ.శాంతి కుమారిని (Shantha Kumari) నియమించారు. ఛీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ ఏపీకి వెళ్ళిపోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిన్నటి నుంచి కొత్త సీఎస్ కోసం కసరత్తు సాగుతోంది. నిన్నటి నుంచి అనేక పేర్లు వార్తల్లో నానుతున్నాయి. అరవింద్ కుమార్, రామకృష్ణారావు ల పేర్లు మీడియాలో ప్రచారమయ్యాయి. అయితే చివరకు అందరికన్నా సీనియర్ అయిన శాంతి కుమారిని నియమించింది (Telangana Govt) ప్రభుత్వం.
ఆమె ప్రస్తుతం ఫారెస్ట్, ఎన్విరాన్ మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఏప్రెల్ 2025 వరకు ఆమెకు సర్వీసు ఉంది. ఆమె అనేక జిల్లాలకు కలెక్టర్ గా పని చేసింది. వైద్యఆరోగ్య శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. సీఎంవో (CMO)లో స్పెషల్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఆమెను ఛీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ఛీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పాలనలో చురుగ్గా, కఠినంగా వ్యవహరిస్తారనే పేరు శాంతకుమారికి (Shantha Kumari) ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్ గా ఎలా పనిచేస్తారనే ఆసక్తి అధికార వర్గాల్లో నెలకొంది.
Also Read: Komatireddy: ఠాక్రే కు ‘కోమటిరెడ్డి’ షాక్.. గాంధీభవన్ కు దూరం!