Revanth Reddy: సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారు: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం రేవంత్ కామెంట్స్ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
- By Balu J Published Date - 12:40 PM, Tue - 14 March 23

టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లను కేసీయార్ కు అమ్ముడుపోయారంటు ఆరోపణలు గుప్పించారు. కొందరు సీనియర్లంటే వేరే విధంగా ఉండేది. కానీ పర్టిక్యులర్ గా కొందరు పెదరెడ్లన్నారు. దాంతోనే రెడ్లందరిలో ఇపుడు మంట మొదలైంది. తాను రెడ్డి అయ్యుండి కొందరు సీనియర్ రెడ్లని చెప్పటంలో అర్ధమేంటో రేవంత్ (Revanth Reddy) కే తెలియాలి అని వ్యతిరేక వర్గం విమర్శలు చేస్తోంది.
నిజామాబాద్ పర్యటనలో ఉన్నట్టుండి కేసీయార్ (CM KCR) కు పార్టీలోని కొందరు పెద్ద రెడ్లు అమ్ముడుపోయారని పెద్ద ఆరోపణ చేసేశారు. ఇపుడే పార్టీలో అసలైన పంచాయతీ మొదలైంది. కేసీయార్ కు అమ్ముడుపోయిన పెదరెడ్లు ఎవరనే పంచాయతీ మొదలవ్వటం ఖాయం. అసలే రేవంత్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏ మాత్రం పడదు. వీళ్ళల్లో వీళ్ళకి ఎన్ని గొడవలున్నా రేవంత్ కు వ్యతిరేకంగా మాత్రం అందరు ఏకమవుతారు. పైగా వెంకటరెడ్డి, జగ్గారెడ్డి మీద పార్టీలోనే చాలామందికి అనుమానాలున్నాయి. జగ్గారెడ్డి ఈమధ్యనే కేసీయార్ తో భేటీఅయ్యారు. వెంకటరెడ్డి ఏదోరోజు బీజేపీలోకి వెళిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇలాంటి వాళ్ళు పార్టీలోనే ఉంటూ పార్టీని దెబ్బతీయటమే టార్గెట్ గా పెట్టుకున్నారనే టాక్ పార్టీలోనే నడుస్తోంది.
అయితే పార్టీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటివరకు రేవంత్ కు ఢిల్లీ నాయకత్వం అండగా నిలుస్తోందని రేవంత్ వర్గం అభిప్రాయపడుతోంది. రాహుల్ సూచనలు, సలహాల మేరకు రేవంత్ (Revanth Reddy) పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చేరికలు, టికెట్స్ పై రేవంత్ ఇప్పటికే ఓ నిర్ణయాన్నికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఏఐసీసీ అండదండలతోనే రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
Also Read: KTR: బీఆర్ఎస్ ఎన్నికల ప్రిపరేషన్.. జిల్లాల ఇన్ చార్జిలను ప్రకటించిన కేటీఆర్!

Related News

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుంది: సోము వీర్రాజు
ఇటీవల ఏపీ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదా కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుందని అన్నారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలంటూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. సోమవారం విజయవాడలోని ధర్నా చౌ