HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Sathupally Voters Talk

2023 TS Polls – Voices of Sathupalli : సత్తుపల్లి లో గెలుపెవరిది..? ఓటర్లు చెపుతున్న ఒకే మాట..

ఈసారి 2023 బిఆర్ఎస్ నుండి ఫస్ట్ టైం సండ్ర పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ నుండి మట్టా రాగమయి, బిజెపి నుండి నంబూరి రామలింగేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు.

  • By Sudheer Published Date - 02:16 PM, Mon - 13 November 23
  • daily-hunt
2023 TS Polls - Voices of Sathupalli :
Spl Talk

2023 TS Polls – Voices of Sathupalli : తెలంగాణ ఎన్నికల (Telangana Elections) హోరు జోరుగా సాగుతుంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తో పాటు బిజెపి (BJP), కాంగ్రెస్ (Congress), సీపీఐ, సీపీఎం, AIMIM , BSP ఇలా తదితర పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఎవరికీ వారు వారి గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ ..తమ మేనిఫెస్టో లను ప్రజలకు తెలుపుతూ ఆకట్టుకునే పనిలో పడ్డారు.

ఇదే క్రమంలో పలు సంస్థలు సైతం నియోజకవర్గాలలో సర్వే చేస్తూ ఓటర్ల తీర్పును తెలియజేస్తున్నారు. మా ‘HashtagU‘ టీం సైతం అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తూ అక్కడి ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం (Sathupalli Constituency)లోని ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

సత్తుపల్లి నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విభిన్న సంస్కృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో ప్రత్యేక చోటు కలదు. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం (Khammam) జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్కృతుల , సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది. 1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది.

భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్ఫూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా ఉంది. స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషించినవారు నియోజక వర్గంలో వుండటం విశేషం. నియోజకవర్గానికి తూర్పున పశ్చిమగోదావరి, ఉత్తరం కృష్ణా, పడమర మధిర నియోజకవర్గం, దక్షిణ కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల తవ్వకాలు ఇప్పటికే ముమ్మరంగా నడుస్తున్నాయి ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు.

ఈ ప్రాంతం నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 వ ముఖ్య మంత్రి గా జలగం వెంగళరావు (Jalagam Vengalrao) అయ్యారు. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించాడు. అలాగే ఎంతోమంది రాజకీయ నేతలు ఈ ప్రాంతం నుండి ఎన్నికై ఉమ్మడి ఏపీ లో అత్యనున్నత పదవులు దక్కించుకొని , అభివృద్ధి చేసారు. ఇటు తెలంగాణ , అటు ఏపీ సరిహద్దుల్లో సత్తుపల్లి ప్రాంతం ఉండడం తో ఇరు రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు.

Also Read:  AP News: టీడీపీ నేతపై వైసీపీ దాడి.. నారా లోకేష్ గరం

ఇక ఈ ప్రాంత రాజకీయాల విషయానికి వస్తే..తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తుపల్లి ఒకటి. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో (2004 Assembly Elections) కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావుపై 9536 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వెంకటరావుకు 89986 ఓట్లు రాగా, నాగేశ్వరరావు 80450 ఓట్లు పడ్డాయి.

2009 శాసనసభ ఎన్నికల (2009 Assembly Elections)లో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఎస్.వెంకటవీరయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన సంభాని చంద్రశేఖర్ పై 14008 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలలో (2014 Assembly Elections) ఇక్కడి నుంచి టీడీపీ నుండి వెంకటవీరయ్య తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దయానంద్ పై 2778 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలలో (2018 Assembly Elections) BRS నుండి పిడమర్తి రవి, బిజెపి తరఫున నంబూరి రామలింగేశ్వరరావు, ప్రజాకూటమి తరఫున టీడీపీ నుండి సండ్ర వెంకటవీరయ్య పోటీచేశారు. ఈ ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్య తన సమీప ప్రత్యర్థి, బిఆర్ఎస్ చెందిన పిడమర్తి రవి పై 19002 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత సండ్ర..అధికార బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.

ఈసారి 2023 (2023 Assembly Elections) బిఆర్ఎస్ నుండి ఫస్ట్ టైం సండ్ర పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ నుండి మట్టా రాగమయి, బిజెపి నుండి నంబూరి రామలింగేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. మరి ఈసారి ఈ ముగ్గురి లో ఓటర్లు ఎవరికీ మద్దతు తెలుపుతున్నారు..? ఎవరికి జై కొడుతున్నారు..? ఎవరి పక్షాన నిలబడుతున్నారు..? అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుందని భావిస్తున్నారనేది..వారి మాటల్లో తెలుసుకుందాం.

Also Read : Minister Bosta Satyanarayana : మంత్రి బొత్స సత్యనారాయణకు హార్ట్ స‌ర్జ‌రీ.. నెల రోజుల పాటు విశ్రాంతి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Polls Survey
  • 2023 Telangana Assembly Elections
  • Matta Ragamayi
  • sandra venkata veeraiah
  • Sathupalli Constituency
  • Voters Talk

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd