HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rs 4 Lakh Annual Salary Us Consulate General Hiring Mason In Hyderabad

Hiring Mason : తాపీమేస్త్రీ కావలెను.. ఏడాదికి రూ.4.50 లక్షల ప్యాకేజీ

Hiring Mason :  ఏ ప్రొఫెషన్ అయినా దానికదే సాటి.. తాపీ మేస్త్రీలకు కూడా మార్కెట్లో ఇప్పుడు ఒక రేంజ్‌లో డిమాండ్ ఉంది.

  • Author : Pasha Date : 03-02-2024 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hiring Mason
Hiring Mason

Hiring Mason :  ఏ ప్రొఫెషన్ అయినా దానికదే సాటి.. తాపీ మేస్త్రీలకు కూడా మార్కెట్లో ఇప్పుడు ఒక రేంజ్‌లో డిమాండ్ ఉంది. వాళ్లకు శాలరీ ప్యాకేజీలను భారీగానే ఆఫర్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ దగ్గర తాపీ మేస్త్రీలకు వర్క్ ఎలాగూ ఉంటుంది. ఇక పెద్దపెద్ద సంస్థలు కూడా తాపీ మేస్త్రీలను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. వాటి క్యాంపస్‌లలోని భవనాల వర్క్స్ కోసం తాపీ మేస్త్రీల సేవలను వాడుకుంటాయి. తాజాగా హైదరాబాద్ నానక్​రామ్​గూడలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తాపీ  మేస్త్రీ జాబ్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైనా ఈ ఉద్యోగానికి(Hiring Mason) దరఖాస్తు చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

నానక్​రామ్​గూడలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఒకే ఒక తాపీ మేస్త్రీ జాబ్ ఉంది. సంవత్సరానికి 4 లక్షల 47వేల 348 రూపాయలు శాలరీ ప్యాకేజీ ఇస్తారు.  ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వారానికి 40 గంటలు పనిచేస్తే సరిపోతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25.  తాపీ పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయాలి. కాంక్రీటు గ్రేడ్‌లు, కాంక్రీటు వేయడం, ఇటుక పని, టెర్రాజో ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, హాలో కాంక్రీట్ బ్లాక్స్ వాల్, సహజ రాయి వేయడం, కట్టింగ్ మొదలైన పనులు తెలిసి ఉండాలి. వివిధ నిర్మాణ పనుల కోసం ఎంత మెటీరియల్ వాడాలనే అంచనాలు కూడా తెలిసి ఉండాలి.

Also Read : Jeff Bezos : రూ.75వేల కోట్ల షేర్లు అమ్మేస్తా.. అపర కుబేరుడి ప్రకటన

కనీసం 8వ తరగతి కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్​, హిందీ, తెలుగు భాషల్లో రాయడం, మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి. వీటిపై టెస్ట్​లు కూడా నిర్వహిస్తారు. న్యూమాటిక్ సుత్తులు, కాంక్రీట్ స్ప్రేయర్‌లతో గతంలో పనిచేసిన అనుభవం అవసరం. ఎటువంటి వాతావరణంలో అయినా పని చేయడానికి శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు పబ్లిక్​ ట్రస్ట్​ క్లియరెన్స్​ సర్టిఫికెట్​ కలిగి ఉండాలి. అప్లై చేసేటప్పుడు పైన చెప్పిన విద్యాప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థుల మెయిల్​కు పంపిస్తారు.  ఇంటర్య్వూ సమయంలో స్కిల్​ టెస్ట్​ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెలక్షన్ చేస్తారు. ఇంకా వివరాలు కావాలంటే HyderabadVacancies@state.gov మెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చు.

Also Read :  Viral : ఎంపీ బరిలో పవన్ కళ్యాణ్..? బీజేపీ ఆఫర్ కు ఓకే చెప్పాడా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hiring Mason
  • hyderabad
  • jobs
  • Mason
  • Rs 4 Lakh Annual Salary
  • US Consulate General

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Territorial Army Recruitment

    మాజీ సైనికులకు గుడ్ న్యూస్‌!

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • JEE : జేఈఈ ఫలితాల్లో ఆకాశ్ విద్యార్థుల హ్యాట్రిక్ స్కోర్లు

  • Bengal Elections : టూవీలర్స్ పై ఆంక్షలు

  • IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC

  • IPL 2026 : CSK కు బిగ్ షాక్

  • Warning : పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్..బౌండరీ దాటితే ఇక అంతే సంగతి !!

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd