CM Revanth : దీనికి రేవంతే సమాధానం చెప్పాలి – కేటీఆర్
CM Revanth : ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టింది
- By Sudheer Published Date - 02:05 PM, Sun - 16 March 25

ఒస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University)లో విద్యార్థుల (Students) ఆందోళనలపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)తీవ్రంగా స్పందించారు. విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తపరచడానికి, నిరసనలు తెలపడానికి ఇది ప్రజాస్వామ్య హక్కు అని ఆయన తెలిపారు. అయితే, ప్రభుత్వం నిషేధం విధించడం ప్రజాస్వామ్య విలువలను హాని చేసినట్టేనని ఆయన విమర్శించారు.
Aurangzebs Tomb: ఔరంగజేబు సమాధిపై వివాదం.. వీలునామాలో సంచలన విషయాలు
ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. “ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును కాపాడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందీ?” అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం అత్యంత దురుద్దేశపూరితమని, ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని, ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం వీడాలని హెచ్చరించారు.
Revanth Reddy : నెక్స్ట్ కూడా నేనే సీఎం- రేవంత్ కు అంత ధీమా ఏంటి..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ అందిస్తానని చెప్పిన సీఎం, ఇప్పుడు ఆ హామీని అటకెక్కించారు అంటూ ఆయన విమర్శించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు, విపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ త్వరలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి.
ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టింది.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.
ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న… pic.twitter.com/KQHhGH52wc
— KTR (@KTRBRS) March 16, 2025