Aasara Pension : ఆసరా పెన్షన్లు వెనక్కి..! – ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి
కొందరు రిటైరైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించి వారి నుండి డబ్బులు రికవరీ చేయాలనీ ఆదేశించింది
- By Sudheer Published Date - 04:22 PM, Sat - 13 July 24

రాష్ట్రంలో మార్పు రావాల్సిందే..కాంగ్రెస్ కావాల్సిందే..రేవంతన్న (Revanth Reddy) గెలవాల్సిందే..అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు వరకు రాష్ట్ర ప్రజలంతా ఇలాగే మాట్లాడుకున్నారు. పదేళ్లు కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పాలించిండు..రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిండు..నిరుద్యోగులను మోసం చేసిండు..రైతుల రుణమాఫీ చేయలేదు..కాంగ్రెస్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి..పెన్షన్ పెరుగుతుంది..రుణమాఫీ జరుగుతుంది..రైతుల రైతు భరోసా పెరుతుందంటూ ప్రచారం చేయడం తో అంత ఓట్లు వేసి పెద్దయ్యాను ఓడించి రేవంత్ ను గెలిపించారు. రేవంత్ గెలవడమే ఆలస్యం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాడు..ఉచిత కరెంట్ ఇచ్చాడు..రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు..ఇక్కడకి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత అసలు సినిమా మొదలుపెట్టాడు.
We’re now on WhatsApp. Click to Join.
జాబ్ క్యాలెండర్ లేదు..పెన్షన్ పెంచలేదు..రుణమాఫీ ఎప్పుడు చేస్తాడో..ఎంత చేస్తాడో తెలియదు..కొత్త రేషన్ కార్డులు లేవు ఇలా ఏ హామీ జరగలేదు.అంతే కాదు ఇప్పుడు ఆసరా పెన్షన్లు వెనక్కి తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేయడం రేవంత్ ఫై మరింత ఆగ్రహం పెంచుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు (Aasara Pension) రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కొందరు రిటైరైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించి వారి నుండి డబ్బులు రికవరీ చేయాలనీ ఆదేశించింది. ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధురాలి కు రూ.1.70 లక్షలు తిరిగివ్వాలని అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం వింత చేష్టలు మొదలుపెట్టిందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. ఏవో కారణాలు చూపిస్తూ ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సొమ్మును వెనక్కి పంపమని నోటిసులు పంపిస్తోందని ట్వీట్ చేశారు. కొత్తగూడెం జిల్లా దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులివ్వడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుందని చెప్పారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని విమర్షించారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని విమర్శించారు కేటీఆర్. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని హెచ్చరించారు.
కొండ నాలుకకు మందేస్తే
ఉన్న నాలిక ఊడినట్టుంది!కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది.
ఏవో సాంకేతిక… pic.twitter.com/tQadMKcvuz
— KTR (@KTRBRS) July 13, 2024
Read Also : TVS Jupiter 125 : టీవీఎస్‌జూపిటర్ 125 CNG వెర్షన్ రాబోతోంది..!