HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddyrevanth Reddy Fires On Ktr

Revanth Reddy : ‘డ్రామారావు’ ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు అంటూ రేవంత్ ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగిండు

  • Author : Sudheer Date : 22-10-2023 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Revanth
Ktr Revanth

తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS-Congress) పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ (Revanth Reddy) – కేటీఆర్ (KTR) లు పరస్పరం విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. కేటీఆర్..రేవంత్ ను ‘రేటెంత రెడ్డి’ గా అభివర్ణిస్తుంటే..రేవంత్ కేటీఆర్ ను ‘డ్రామారావు’ గా అభివర్ణిస్తూ సెటైర్లు వేస్తున్నారు.

తాజాగా రేవంత్ తన ట్విట్టర్ X వేదికగా కేటీఆర్ ఫై నిప్పులు చెరిగారు. ‘బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు. తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగిండు. నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40% కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణాలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం!
కాంగ్రెస్ వస్తుంది… తెలంగాణ గెలుస్తుంది!’ అని ట్వీట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క కేటీఆర్ మాత్రం..తమకు గతంలో వచ్చిన 88 సీట్ల కన్నా ఈసారి ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 42 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని , బీఆర్‌ఎస్‌, బీజేపీ సహా ఇతర ఏ పార్టీల్లో టికెట్లు రానివారికోసం కాంగ్రెస్‌ వెతుకుతున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని అన్నారు. గతంలో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఈసారి 110 సీట్లలో డిపాజిట్లు కోల్పోవటం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్నికల క్షేత్రంలో తమతో తలపడేది కాంగ్రెస్సేనని అన్నారు. కాంగ్రెస్‌కు తన చరిత్రే గుదిబండ అని తెలిపారు. 55 ఏండ్ల పాలనలో ఏ రంగంలో తీసుకున్నా కాంగ్రెస్‌ అట్టర్‌ఫ్లాప్‌ అని ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు.

Read Also : Talluri Jeevan Kumar : బీఆర్ఎస్‌లోకి తాళ్లూరి జీవన్ కుమార్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • revanth reddy
  • Telangana 2023 Elections

Related News

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd