HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy Writes Open Letter To Cm Kcr On Crop Loss Issue

Revanth Reddy: పంటనష్టంపై సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ

‘‘రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

  • Author : Balu J Date : 12-07-2022 - 6:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress list

‘‘రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు నీట మునిగి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జోరువానతో.. అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మీరేమో ఇవే పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ రైతు బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి గానీ, వ్యవసాయ విభాగం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

విత్తనాలు మొలక స్థాయిలోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తకుండా వర్షాల వల్ల మురిగిపోతున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, వానల కారణంగా మళ్లీ విత్తనాలు వేయడమో, నారు పోసుకుని నాట్లు వేయడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి  కేసీఆర్ కు రాసిన లేఖలో వివరించారు.

డిమాండ్లు

  • భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి.
  • తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
  • కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలి.
  • తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • farmers
  • heavy rains
  • revanth reddy

Related News

Meeting Of CMs

India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు

    Latest News

    • మార్చి 3న భారత్‌లో ‘బ్లడ్ మూన్’!

    • 27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

    • టీమిండియాపై రాహుల్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు!

    • ఇరాన్‌లో ఉద్రిక్తతలు .. భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలి : ఎంబసీ హెచ్చరిక

    • కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    Trending News

      • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

      • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

      • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

      • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd