TS Mega DSC Notification : నిరుద్యోగులకు తీపి కబురు తెలిపిన సీఎం రేవంత్
- Author : Sudheer
Date : 27-02-2024 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ నిరుద్యోగులకు (Telangana Unemployed ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు అందించారు. ఈరోజు చేవెళ్ల (Chevella
)లో కాంగ్రెస్ పార్టీ (Congress ) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పదేళ్లుగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాక నిరాశ, నిస్పృహతో ఉన్న డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో మెగా డీఎస్సీ (Mega DSC Notification) నోటికేషన్ ఇచ్చి వారికి ఉద్యోగాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తలు శ్రమ, రక్తం ఉందన్నారు. కార్యకర్తల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. వాళ్ల రుణం తీర్చుతానని టైమ్ వచ్చిందన్నారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలు మాట ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీ అమలు చేసి చూపించామన్నారు. ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పేదల గురించే కాదు.. నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏనాడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25వేల మందిరికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మెగా డిఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
పోరాటాల నేపథ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అభయ హస్తం మాటను సోనియా గాంధీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను పూర్తి చేస్తామన్నారు.
Read Also : Raghurama Krishnamraju : నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు..?