KCR Vs Revanth Reddy : కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్ లీడ్.. గజ్వేల్‌లో కేసీఆర్ లీడ్
KCR Vs Revanth Reddy : గజ్వేల్‌లో ఈవీఎం కౌంటింగ్ మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ లీడ్‌లో ఉన్నారు.
- By Pasha Published Date - 09:12 AM, Sun - 3 December 23

KCR Vs Revanth Reddy : గజ్వేల్‌లో ఈవీఎం కౌంటింగ్ మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ లీడ్‌లో ఉన్నారు. మరోవైపు కామారెడ్డిలో ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్‌లోనూ రేవంత్(KCR Vs Revanth Reddy) లీడ్ లో కొనసాగుతున్నారు. అంతకుముందు కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి లీడ్ లో నిలిచారు. సీఎం కేసీఆర్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఖైరతాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న విజయారెడ్డి లీడ్ లో ఉన్నారు.
- సిద్ధిపేటలో మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు లీడ్ లో ఉన్నారు.
- బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- అశ్వారావుపేటలో తొలి రౌండ్ లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 4318 ఓట్లు వచ్చాయి.
- నాగార్జున సాగర్ లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.