Revanth Reddy Defamation Suit : సంబరాల్లో కాంగ్రెస్..రేవంత్ రెడ్డి కి భారీ షాక్
Defamation Suit : సీఎం రేవంత్ రెడ్డి కి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా ఫైల్ అవ్వడం తో కాంగ్రెస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తుంది.
- By Sudheer Published Date - 12:55 PM, Fri - 29 November 24

తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను(Prajapalana Victory Celebrations) నిర్వహించే ప్లానులో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే వేడుకలకు సంబదించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా (Revanth Reddy Defamation Suit) ఫైల్ అవ్వడం తో కాంగ్రెస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తుంది.
ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సవాలు చేస్తూ.. అటు హీరో అక్కినేని నాగార్జున, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేరువేరుగా పరువు నష్టం దావాలు వేయగా.. వాటిపై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసు తెరపైకి రావటం.. అది కూడా విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో విచారణకు రావటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచారంలో బీజేపీ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ.. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసుపై నాంపల్లి కోర్టు గురువారం (నవంబర్ 28న) రోజు విచారణ చేపట్టింది. బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆయన చేసిన ఆరోపణలు అటు పార్టీకే కాకుండా ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తీవ్రమైన అసత్య ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే.. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ కేసును డిసెంబర్ 11కు వాయిదా వేసింది. మరి దీనిపై కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
Read Also : Hill Hold Control : హిల్ హోల్డ్ కంట్రోల్ వల్ల ప్రయోజనం ఏమిటి..? కొత్త కారును కొనే ముందు ఇది తెలుసుకోండి..!