Revanth Reddy Govt : రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసుల ఎత్తివేత విషయంలోనూ ఆదేశాలు వచ్చాయి. అయితే అందులో తీసివేయగా… మిగిలిన కేసుల విషయంలో వివరాలను సేకరించే పనిలో ఉంది కొత్త సర్కార్
- By Sudheer Published Date - 12:32 PM, Sat - 9 December 23

తెలంగాణ నూతన సీఎం గా ప్రమాణ స్వీకారం చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తనదైన మార్క్ పాలనను మొదలుపెట్టారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ (Pragathi Bhavan) పేరును మార్చడం..ప్రజా దర్బార్ (Praja Darbar) ను ఏర్పాటు చేసి..ప్రజల సమస్యల ఫై దృష్టి సారించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించారు.
2009 డిసెంబర్ 09 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు.త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసుల ఎత్తివేతకు సంబంధించి… డిపార్ట్ మెంట్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసుల ఎత్తివేత విషయంలోనూ ఆదేశాలు వచ్చాయి. అయితే అందులో తీసివేయగా… మిగిలిన కేసుల విషయంలో వివరాలను సేకరించే పనిలో ఉంది కొత్త సర్కార్. ఈ నేపథ్యంలో… పోలీసు శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె.. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమరుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం ముందు భారీ సంఖ్యలో తరలివచ్చిన 1969 తెలంగాణ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించామని కానీ గత బీఆర్ఎస్ప్రభుత్వం పట్టించుకోలేదని సంఘం అధ్యక్షుడు రామరాజు వాపోయారు. తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అమరుల కుటుంబానికి 250 గజాల స్థలం, 25 వేల పెన్షన్, 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, హెల్త్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని కోరారు.
Read Also : Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కింది – కిషన్ రెడ్డి ఫైర్