Modi Telangana Tour : కేసీఆర్ ను గెలిపించేందుకే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలు – రేవంత్
కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పే మోడీ.. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ , ఐటీ విచారణ చేయడం లేదు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి
- By Sudheer Published Date - 03:18 PM, Wed - 4 October 23

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy )..ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన (Modi Telangana Tours) ఫై విమర్శలు చేసారు. మోడీ..తెలంగాణ లో వరుస పర్యటనలు కేసీఆర్ ను మరోసారి గెలిపించేందుకే అని రేవంత్ ఆరోపించారు. బిజెపి – బిఆర్ఎస్ (BJP – BRS) పార్టీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ తనదైన స్టయిల్ లో రేవంత్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బయటకు కనిపించేది అంతా నాణానికి ఒకవైపు మాత్రమే..దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి, అప్రమత్తంగా ఉండాలి రేవంత్ సూచించారు.
‘‘బీఆర్ఎస్-బీజేపీ ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని (PM Modi) బట్టబయలు చేశారన్నారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోడీ పర్యటనలు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోడీ అపహాస్యం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోడీ చెప్పాల్సింది. బీఆర్ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పే మోడీ.. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ , ఐటీ విచారణ చేయడం లేదు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్‌పై మోడీ చర్యలు తీసుకోవడం లేదన్నారు రేవంత్.
We’re now on WhatsApp. Click to Join.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తో బీఆరెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆరెస్, 7 బీజేపీ కి, 1 ఎంఐఎం కు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్ మీద బీజేపీ, బీఆరెస్ ఆరోపణలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్ ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు తేల్చి చూపుతున్నాయని..అందుకే కాంగ్రెస్ ఫై బిజెపి , బిఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు రేవంత్. ఇక ఎంఐఎం పార్టీ బీఆరెస్ కు మద్దతు ఇవ్వడం మీద కూడా పునరాలోచించుకోవాలని రేవంత్ సలహా ఇచ్చారు.
Read Also : Telangana: రూ.900 కోట్ల ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం