Musi Project : హైకోర్టు ను ఆశ్రయించిన మూసి వాసులు
Musi Project : మూసీ పరివాహక ప్రాంతాల్లోని 100మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు
- By Sudheer Published Date - 08:00 PM, Mon - 14 October 24

మూసి సుందరీకరణ (Musi Project ) పేరుతో మూసి పక్కన ఉన్న నివాసాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఖాళీ చేసిన వారికీ డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తున్నారు. అయితే కొద్దీ రోజులుగా క్రితం ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం ఫై మూసి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. ప్రతిపక్ష పార్టీలు సైతం మూసి వాసులకు సపోర్ట్ గా నిలువడం, హైకోర్టు సైతం ప్రభుత్వం ఫై సీరియస్ అవ్వడంతో హైడ్రా (Hydraa) కూల్చివేతలు బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలను మంగళవారం నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మూసీ రివర్ బెడ్‌పై 2,116 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కాగా కూల్చివేతల పున:ప్రారంభం నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని 100మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఏ ఇంటి వద్ద చూసిన కోర్ట్ స్టే లే దర్శనమిస్తున్నాయి. మూసి సుందరీకరణ కోసం తమ ఇండ్లు ఇవ్వమంటే..ఇవ్వం అంటూ ఇంటి యజమానులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపోరాటం చేయడానికి ఏందాకైనా పోతామని చెబుతున్నారు.
Read Also : Pawan Kalyan : తాను ఏ హీరో కు పోటీ కాదని తెలిపిన పవన్ కళ్యాణ్