Chicken, Liquor : కేసీఆర్, కేటీఆర్ కోసం కోడి, క్వార్టర్ బాటిల్ పంపిణీ
జాతీయ పార్టీ పెట్టే కేసీఆర్ ప్రధాని కావాలని, తెలంగాణ సీఎంగా కేటీఆర్ ఉండాలని కోరుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు
- By CS Rao Published Date - 04:29 PM, Tue - 4 October 22

జాతీయ పార్టీ పెట్టే కేసీఆర్ ప్రధాని కావాలని, తెలంగాణ సీఎంగా కేటీఆర్ ఉండాలని కోరుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు. అందుకోసం పూజలు చేసే వాళ్లు లేకపోలేదు. దసరా సందర్భంగా అమ్మవారు కేసీఆర్, కేటీఆర్ లను దీవించాలని వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి వినూత్నంగా క్వార్టర్ బాటిల్, ఒక కోడిని పంచిపెట్టడం విచిత్రం.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. ఈ శుభ సందర్భంగా జాతీయ పార్టీకి వారే అధ్యక్షునిగా ఎంపిక కావాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలు విజయం సాధించి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని శ్రీహరి పూజలు నిర్వహించారు. అంతేకాదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కల్వకుంట్ల తారకరామారావు ఎంపికై రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేపించారు. అంతవరకు బాగానే ఉంది. పూజల అనంతరం వరంగల్ చౌరస్తాలో పేద హమాలి లకు ఒక కోడి ఒక క్వార్టర్ విస్కీ బాటిల్ ని పంపిణీ చేయడం హైలెట్ పాయింట్.