HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Raja Singhs Political U Turn

Rajasingh : రాజాసింగ్ వెనకడుగు వేసినట్లేనా..?

Rajasingh : అప్పటివరకు పార్టీని టార్గెట్ చేస్తూ కఠిన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యల్లో బీజేపీకి మద్దతుగా మాట్లాడారు

  • Author : Sudheer Date : 23-07-2025 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajasingh Gowtharao
Rajasingh Gowtharao

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అప్పటివరకు పార్టీని టార్గెట్ చేస్తూ కఠిన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యల్లో బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీనే అని రాజాసింగ్ ప్రకటించడంతో ఆయన తిరిగి కమలం గూటికి చేరనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

రాజాసింగ్ మాట్లాడుతూ.. తనను ఎవ్వరి పార్టీ కూడా భరించలేరని.. తెలంగాణలో బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఎంఐఎంతో కూర్చున్నవేనని పేర్కొన్నారు. ధర్మం, హిందుత్వం కోసం మాత్రమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీ మాత్రం బీజేపీయే అని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో పని చేయాలన్న అభిమానం తనకుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో రాజాసింగ్ మళ్లీ బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పరిణామాలపై బీజేపీ పార్టీలోనూ చర్చ మొదలైంది. ఇటీవల రాజాసింగ్‌పై విమర్శలు చేసిన మాధవీలతను పార్టీ నేతలు మందలించినట్లు సమాచారం. ఆమెను మీడియా ముందు సైలెంట్ గా ఉండాలని సూచించారని అంటున్నారు. దీనితోపాటు రాజాసింగ్‌పై గతంలో ఉన్న ఆగ్రహాన్ని పక్కన పెట్టి ఆయన పాజిటివ్ వ్యాఖ్యలకు స్పందిస్తున్న కమలం నేతలు, ఆయన తిరిగి పార్టీలో చేరికపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాజాసింగ్ తిరిగి బీజేపీలోకి వస్తే హైదరాబాద్‌ రాజకీయాల్లో మరోసారి సంచలనం తప్పదని భావిస్తున్నారు. ముస్లిం ఓట్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఆయన తీవ్ర హిందుత్వ వ్యాఖ్యలు, బలమైన ఓటు బ్యాంక్‌ ప్రభావం పార్టీకి కీలకంగా మారవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా రాజీనామా తర్వాత రాజకీయంగా నిశ్శబ్దంలోకి వెళ్లిన రాజాసింగ్‌.. మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP recently
  • BJP resign
  • Raja Singh's Political U-Turn
  • Rajasingh
  • Telangana MLA Raja Singh

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

    Latest News

    • Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్

    • Amazon Data Centre: ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటర్: సీఎం రేవంత్

    • Regular Sugar vs. Monk Fruit: సాధారణ చక్కెర vs. మాంక్ ఫ్రూట్: రక్తంలో చక్కెర స్థాయికి ఏది మంచిది?

    • Liquor prices: మందుబాబులకు కిక్కు దిగే వార్త.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు

    • Nitin Gadkari: ఈ E20 ఇథనాల్ విధానాన్ని సమర్థించిన గడ్కరీ.. వినియోగదారులు అధిక ధరకు స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని అన్నారు..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd