HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Raja Singh Resigns From Bjp Party Accepts Decision

Raja Singh : రాజాసింగ్ కు బీజేపీ షాక్.. జేపీ నడ్డా కీలక నిర్ణయం

Raja Singh : హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీ. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, పార్టీ దీనిని అంగీకరించింది.

  • Author : Kavya Krishna Date : 11-07-2025 - 1:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raja Singh
Raja Singh

Raja Singh : హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీ. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, పార్టీ దీనిని అంగీకరించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఈ రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ కార్యాలయ వర్గాల ప్రకారం, కేంద్ర నాయకత్వం రాజాసింగ్‌ నిర్ణయాన్ని సమీక్షించి, ఆమోదించినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిలో రాంచందర్‌రావుకు పగ్గాలు అప్పగించడం పట్ల రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలని అనుకున్నా, తన మద్దతుదారులను బెదిరించడం, నామినేషన్‌ వేయనివ్వకపోవడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. “వాళ్లు అనుకున్న వాళ్లకే పదవులు ఇచ్చారు. అందుకే ఈ పార్టీని వీడుతున్నాను. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే పార్టీ కార్యాలయానికి వచ్చాను,” అని తెలిపారు.

Shubman Gill: టీమిండియా వ‌న్డే కెప్టెన్‌గా శుభ‌మ‌న్ గిల్‌?

“తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, అధిక నేతలు అది జరగకూడదని చూస్తున్నారు. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. అయినా బీజేపీ కోసం సమర్పణగా పనిచేశాను. కానీ ప్రతిఫలం శూన్యం. అందుకే ఈ పార్టీకి ‘లవ్ లెటర్’ (రాజీనామా లేఖ) ఇచ్చి వెళ్తున్నా. మీకూ, మీ పార్టీకూ దండం,” అని రాజాసింగ్‌ ఆవేదనతో వ్యాఖ్యానించారు.

బీజేపీకి రాజీనామా చేసినా, తన హిందుత్వ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. “ఈ రాజీనామా లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబిస్తుంది,” అని చెప్పిన ఆయన, పార్టీ నుంచి బయటకు వచ్చినా ప్రజలకు చేరువగా ఉంటానని, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు.

ఇక రాజాసింగ్‌ బీజేపీ సింబల్‌పై గెలిచిన ఎమ్మెల్యే కావడంతో, ప్రస్తుతం ఆయన అనర్హుడని భావించాలా? లేదా స్వతంత్రంగా కొనసాగించాలా? అనే చర్చ కూడా మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పీకర్‌ను ఆశ్రయించి రాజాసింగ్‌ను సస్పెండ్ చేయాలని కోరాల్సిందిగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని సమాచారం.

Tennis Player: టెన్నిస్ ప్లేయ‌ర్ హ‌త్య‌.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు!

 

Rajasingh Resign

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP internal rift
  • BJP President Telangana
  • BJP Telangana
  • Gosha Mahal MLA
  • JP Nadda
  • kishan reddy
  • raja singh
  • Raja Singh resignation
  • Telangana MLA resignation
  • telangana politics

Related News

Errabelli Dayakar Rao

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Errabelli Dayakar Rao  తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డ

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

  • Kalvakuntla Kavitha

    జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

  • Janasena Party

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !

  • Telangana Municipal Election Results

    నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం

Latest News

  • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

  • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

  • ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌

Trending News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd