Rains : తెలంగాణలో ఇంకో రెండు రోజులు వర్షాలే..వర్షాలు
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది
- Author : Sudheer
Date : 20-07-2024 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
గత నాల్గు రోజులుగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీ వర్షాలు (Rains) కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల దాటికి వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల చెరువులు తెగి పలు ఊర్లను ముంచెత్తుతున్నాయి. ఇక రవాణా వ్యవస్థ కూడా స్థంభించింది. స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుందని.. పూరికి 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతూ 12గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఇక హైదరాబాద్ (Hyderabad) లో నిన్న రాత్రి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అక్కడ, ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Read Also : Kaleshwaram Project : గోదావరిలో..కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి – కేటీఆర్