Harish Rao: త్వరలోనే సిద్ధిపేటకు రైలు మార్గం..!!
సిద్ధిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సదస్సుకు హాజరయ్యారు మంత్రి హారీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర అభివ్రుద్ధిలో భవన నిర్మాణ కార్మికులు ఎంతో క్రుషి చేశారన్నారు.
- Author : hashtagu
Date : 24-07-2022 - 5:02 IST
Published By : Hashtagu Telugu Desk
సిద్ధిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సదస్సుకు హాజరయ్యారు మంత్రి హారీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర అభివ్రుద్ధిలో భవన నిర్మాణ కార్మికులు ఎంతో క్రుషి చేశారన్నారు. సిద్ధిపేట భవన నిర్మాణ కార్మికుల వెసులుబాటు కోసం క్యాంపు కార్యాలయంలో పీఏను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు హారీష్.
కాగా మరో 3 నెలల్లో అత్యుత్తమ అంతర్జాతీయ l&T నిర్మాణ కంపెనీ ద్వారా కార్మికులకు శిక్షణ శిబిరాన్ని హైదరాబాద్ తర్వాత సిద్ధిపేటలో ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా సిద్ధిపేటలో ఒక విమాన సౌకర్యం తప్ప అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని హారీశ్ రావు అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో సిద్ధిపేట కు రైలు మార్గం వస్తుందని చెప్పారు. సిద్ధిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులతో సమానమని తెలిపారు హారీశ్ . ఈ బడ్జెట్ లో భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికి మోటార్ సైకిల్ అందిస్తామని తెలిపారు.