Rahul Gandhi : దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్‌కు మధ్య పోటీ – రాహుల్
ఢిల్లీలో మోడీకి బీఆర్‌ఎస్, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మోడీ పరస్పర మద్దతుంది
- Author : Sudheer
Date : 26-11-2023 - 3:55 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campgin) మరో రెండు రోజులతో ముంగింపు పలకబోతుంది. ఈ క్రమంలో ఉన్న ఈ కొద్దీ సమాయంలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. అందుకు గాను ప్రచారంలో గల్లీ నుండి ఢిల్లీ నేతల వరకు పాల్గొని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రధాని మోడీ (Modi) , అమిత్ షా , నడ్డా తదితర బిజెపి నేతలు , ప్రియాంక గాంధీ , రాహుల్ (Rahul), ఖర్గే , శివకుమార్ ఇలా పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు అంత కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
నేడు ఆంథోల్ , సంగారెడ్డి సభల్లో పాల్గొన్న రాహుల్..మోడీ , కేసీఆర్ లపై విమర్శల వర్షం కురిపించారు. ‘ఢిల్లీలో మోడీకి బీఆర్‌ఎస్, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మోడీ పరస్పర మద్దతుంది’ అని రాహుల్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న రాహుల్.. కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోందన్నారు రాహుల్ . కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోడీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్నారు. లోక్‌సభలో మోడీకి బీఆర్‌ఎస్, తెలంగాణలో కేసీఆర్‌కు మోడీ మద్దతిస్తారని చెప్పారు. ప్రధాని మోడీ తనపై 24కేసులు పెట్టారన్న రాహుల్.. అవినీతిపరుడైన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని విమర్శించారు.
ఈ ఎన్నికలు ‘దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్‌కు మధ్య పోటీ’ అని.. కేసీఆర్ చదువుకున్న స్కూల్ కాంగ్రెస్ కట్టించిందే అని రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేసింది. కేసీఆర్.. మీ చేతిలోనే ధరణి ఉంది. పేదల నుంచి 20 లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారు. నిన్న రాత్రి తెలంగాణ యువకులతో కలిసి మాట్లాడా. నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకు రావడం లేదు. ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి. కేసీఆర్ దోచుకున్న డబ్బులు ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తాం. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. చాతి ముందుకు పెట్టుకుని తిరిగే వారి, కారు టైర్‌లో గాలి తీసేది కాంగ్రెస్ పార్టీయే’ అని రాహుల్ తెలిపారు.
Read Also : PM Modi : ఫామ్‌హౌజ్‌లో పడుకునే సీఎం మనకు అవసరమా..? – మోడీ