HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rahul Gandhi Speech At Kollapur Congress Public Meeting

Rahul : మనది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం -రాహుల్

పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదన్నారు.

  • Author : Sudheer Date : 31-10-2023 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Kollapur
Rahul Kollapur

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ పార్టీ (Congress Party) వరుస సభలతో కార్యకర్తల్లో జోష్ నింపుతూ..ప్రజలను ఆకట్టుకుంది. తెలంగాణ లో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ హామీలను (Congress 6 Guarantee Schemes) అమలు చేస్తామంటూ..హామీలను ప్రజలకు వివరిస్తూ..బిఆర్ఎస్ ఫై విమర్శలు సంధిస్తూ వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు జాతీయ నేతలు సైతం ప్రచారంలో పాల్గొంటూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు.

ఈరోజు ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌ (Kollapur)లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభేరి సభ (Congress Praja Bheri Sabha) నిర్వహించింది. ఈ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉండగా..ఆమె అనారోగ్యంతో బాధపడుతుండడం తో రాహుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన సోదరి ప్రియాంక గాంధీ అనారోగ్యం దృష్ట్యా తాను వచ్చానని చెప్పారు. మనది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధమన్నారు. పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదన్నారు. పైగా తమ ప్రభుత్వం వస్తే రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని , ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు.

అలాగే ధరణి ఫై కూడా రాహుల్ మండిపడ్డారు. ధరణి పేరుతో భూముల్ని లాగేసుకునే కుట్ర జరుగుతోంది. ధరణితో లాభం జరిగింది కేవలం కల్వకుంట్ల కుటుంబానికే. ప్రభుత్వ సంస్థలు అన్ని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రజల ధనం పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే వెళ్తోంది. వారి చేతుల్లోనే రెవెన్యూ, ఎక్సైజ్ లాంటి శాఖలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కలలు కన్నది దొరల తెలంగాణ కోసం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో నీటి ప్రాజెక్టులను నిర్మించింది. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, సింగూర్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు రాహుల్.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రాష్ట్రానికి వెన్నెముకగా మహిళలు ఉన్నారు. రైతు భరోసా అనే కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తోంది. రూ.15 వేలు ప్రతి ఏడాదికి, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల రూపాయలు ఇస్తాం. గ్రుహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు కాల్చే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం కింద పింఛన్లు రూ.4 వేలు చేయబోతున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం అన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ సొమ్మును దోచేశారన్నారు. లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

మీరు ఎంఐఎంకి ఓటేసినా, బీఆర్ఎస్‌ ఓటేసినా వేస్ట్. బీజేపీకి ఓటేసినా పరోక్షంగా బీఆర్ఎస్‌కి ఓటేసినట్లే. ఇక్కడ బీఆర్ఎస్ ను పడగొట్టడమే కాకుండా, 2024లో బీజేపీని రానివ్వకుండా అడ్డుకుంటాం. తెలంగాణ ప్రజలు స్పష్టతతోనే ఉన్నారు. ఈ రోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి. మన బంధం రాజకీయ బంధం మాత్రమే కాదు. కుటుంబ బంధం. చరిత్రలో ఇందిరా గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. మీరందరూ తెలంగాణ కోసం పోరాడితే, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని మంజూరు చేశారు’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

Read Also : KCR : ఉత్తమ్ గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత ..హుజూర్‌నగర్‌ సభలో కేసీఆర్ నిప్పులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Kollapur Public Meeting
  • kcr
  • Kollapur
  • rahul gandhi

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

  • Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd