Rahul Gandhi : కాంట్రాక్ట్ కార్మికుల బాధలు తెలుసుకొని చలించిపోయిన రాహుల్
రోజుకు ఎంత డబ్బు వస్తుందని రాహుల్ ఆరా తీశారు
- By Sudheer Published Date - 12:33 PM, Tue - 28 November 23

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) హైదరాబాద్ ఖైరతాబాద్ (Khairatabad) లో కాంట్రాక్ట్ కార్మికులతో (Contract Workers) భేటీ అయ్యారు. డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్లు, హెల్త్ వర్కర్స్ ఇలా అంత కూడా తమ బాధలను రాహుల్ కు చెప్పుకున్నారు. రోజుకు ఎంత డబ్బు వస్తుందని రాహుల్ ఆరా తీశారు. తమకు టూ వీలర్స్ ఇప్పించాలని, పెట్రోల్ రేట్ తగ్గించాలని డెలివరీ బాయ్స్ కోరారు. అటు సానిటరీ వర్కర్లు, హెల్త్ వర్కర్లు కూడా తమ సమస్యలను రాహుల్ ముందు ఏకరుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల కొద్దీ పని చేసినా తగినంత వేతనం రావడం లేదని సానిటరీ వర్కర్లు చెప్పుకొని బాధపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్ చేయలేదని , తమపై దయచూపి పర్మినెంట్ చేయాలని సానిటరీ వర్కర్లు వినతి పత్రం అందజేశారు. డబుల్ బెడ్ రూమ్, పెన్షన్లు ఇవ్వడం లేదని శానిటరీ వర్కర్స్ రాహుల్ తో చెప్పారు. గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్ లో ఒక స్కీమ్ ఆమలు చేస్తున్నామని రాహుల్ వారికి తెలిపారు.
ప్రతి ట్రాన్సాక్షన్ లో కొంత భాగాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.
Read Also : Manickam Tagore: మోదీని మహాత్మా గాంధీతో పోల్చడం ఏంటి.. మండిపడ్డ మాణికం ఠాగూర్