Rahul Warning: సీనియర్లు గీతాదాటితే వేటే: రాహుల్ బహిరంగ వార్నింగ్
వరంగల్ రైతు సంఘర్షణ సభా వేదికగా కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు.
- Author : CS Rao
Date : 06-05-2022 - 9:51 IST
Published By : Hashtagu Telugu Desk
వరంగల్ రైతు సంఘర్షణ సభా వేదికగా కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి బహిష్కరిస్తామన్నారు.
తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని వరంగల్ రైతు సంఘర్షణ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇకపై ఈ ప్రశ్న ఏ కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు అడిగినా బహిష్కరిస్తామని ప్రకటించారు. వాళ్లెవరైనా ఎంత పెద్దవాళ్లైనా సరే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలతో సంబంధాలు పెట్టుకున్నా పార్టీని విడిచిపెట్టి పోవచ్చునని అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ కు అవసరం లేదని తేల్చి చెప్పారు.
సిద్ధాంత పరమైన పోరాటం చేసి టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ తో ఇక యుద్దం చేయాలని పిలుపు ఇచ్చారు. ఎన్నికల యుద్దానికి సిద్దం కావాలని రాహుల్ సీనియర్లు కు , క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు