Public Angry On Hydra : మా ఉసురు తగిలి సర్వ నాశనమైపోతరు – బాధితుల శాపనార్థాలు
Public Angry On Hydra : కాంగ్రెస్ సర్కార్ పని అయిపోయినట్లే అని..జీవితం లో మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు..రానివ్వం అని తేల్చి చెపుతున్నారు
- By Sudheer Published Date - 12:09 PM, Fri - 27 September 24

Public Angry On Hydra : హైదరాబాద్ (Hyderabad).. గత పదేళ్లలో ఎంతగా అభివృద్ధి జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజల దగ్గర నుండి కోటీశ్వర్ల వరకు అంతా హైదరాబాదులో ఉండాలని.. హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలని.. హైదరాబాద్ లో ఓ చిన్న వ్యాపారమైనా చేయాలని భవించారు..భావిస్తూ వచ్చారు. అలాగే ఊర్లో ఉన్న భూముల అమ్ముకొని మరి హైదరాబాదులో ఓ చిన్న జాగా కొనుక్కొని , ఓ ఇల్లు కట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఎంతోమంది నగరానికి వచ్చి పలు వ్యాపారాలు మొదలుపెట్టారు. బ్యాంకుల్లో లోన్ లు తీసుకొని ఇల్లులు కట్టుకున్నారు.. ఇక అంతా హ్యాపీ మనకే చింత లేదు అని అంతా భావించారు.
ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇస్తేనే కదా మీము కట్టుకుంది
కానీ ఇప్పుడు ఎందుకు హైదరాబాదుకి వచ్చామా.. అని బాధపడుతున్నారు. దీనికి కారణం రేవంత్ (Revanth Reddy) సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలే. ప్రభుత్వ భూములు , చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూలుస్తాము అంటూ హైడ్రా (Hydraa) ను తీసుకొచ్చారు. ఈ నిర్ణయం పట్ల అంత ఆనందం వ్యక్తం చేసారు. కానీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కూలుస్తామని చెప్పిన హైడ్రా..ఇప్పుడు 50 ఏళ్ళు గా ఉంటున్న ఇళ్లను సైతం కూల్చేస్తుండడం ప్రజల్లో ఆగ్రహం పెంచుతుంది. తాతల నాటి నుండి వస్తున్న ఇళ్లను కూల్చేసి అక్రమ నిర్మాణము అంటే వారంతా ఎదురుతిరుగుతున్నారు. ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇస్తేనే కదా మీము కట్టుకుంది. మిరే పర్మిషన్ ఇచ్చి మిరే కూలుస్తాము అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగె ఇండ్లను కూల్చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని పేదల ఇండ్లను కూలుస్తున్నారు
పెద్దల నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి.. పేదల ఇండ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాన్లు కూడా తీసుకోవటానికి సమయం లేకుండా ఉన్నపళంగా కూల్చేస్తున్నారని వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని పేదల ఇండ్లను కూలగొతున్నారని .. తమ ఇంటిని కూల్చే అధికారం ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు.
ఓట్లేసి గెలిపించింది మా ఇండ్లను కూలగొట్టించుకునేందుకా..?
‘ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఓట్లేసి గెలిపించింది మా ఇండ్లను కూలగొట్టించుకునేందుకా?’ అని ఎదురుతిరుగుతున్నారు.‘మాకు విషమిచ్చి చంపి శవాలను మూసీలో పడేసిన తర్వాతే మా ఇండ్లు కూలగొట్టుండ్రి’ అంటూ మహిళలు వాపోతున్నారు. ‘పేదలకు ఇండ్లు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇండ్లను కూలగొట్టి మా జీవితాలనే కూల్చేయాలనుకుంటున్నోని కుటుంబం బాగుంటదా? మా ఉసురు తగలకుండా పోతడా’ అంటూ పెద్దవారు శాపనార్థాలు పెడుతున్నారు. ‘కండ్లల్లో కారం పోసి కొడుతం.. మేమొచ్చి 40 ఏండ్లు దాటింది.. మా ఇండ్లకు పట్టాలు కూడా ఉన్నాయి. అప్పుడు చెరువే లేదు. నాయకులు గేమ్‌లు ఆడుతూ జనాలను పిచ్చోళ్లను చేస్తుండ్రు. మీరు.. జేసీబీ తెచ్చి ఈడ పెట్టుండ్రి.. ఒక్కొక్క నా కొడుకును నరకకుంటే ..పోతాం అంటూ’ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పని అయిపోయినట్లే అని..జీవితం లో మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు..రానివ్వం అని తేల్చి చెపుతున్నారు. ఒక్కసారి ఓటు వేసినందుకు ఏడాది గడవకముందే రోడ్డున పడేసాడని గగ్గోలు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తగ్గుతుందా..లేక పోతే పోనీ ప్రభుత్వం అని ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.
Read Also : Devara : కొరటాల ఫై ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్