HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Protest To Ktr

KTR : కేటీఆర్ కు నిరసన సెగ

KTR : 'గో బ్యాక్ KTR' అంటూ సాయిబాబా అభిమానులు, కామ్రేడ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదేళ్లుగా సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు BRS ఏం చేసిందని ప్రశ్నించారు.

  • Author : Sudheer Date : 14-10-2024 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Saibaba
Ktr Saibaba

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (GN Sai Baba) భౌతికకాయానికి నివాళులర్పించడానికి వచ్చిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కు నిరసన సెగ తగిలింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా (57) హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సాయిబాబాకు గత నెల 28న ఆపరేషన్‌ చేసిన డాక్టర్స్.. గాల్‌ బ్లాడర్‌ను (పిత్తాశయాన్ని) తొలగించి స్టంట్‌ వేశారు. కానీ మరో చోట చీము పట్టడంతో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. వైద్యులు చీమును తొలగించినప్పటికీ సాయిబాబా పరిస్థితి మరింత క్షిణించి కన్నుమూశారు. సాయిబాబా మృతి పట్ల యావత్ ప్రజానీకం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె మౌలాలిలో సాయిబాబా భౌతిక కాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళ్లు అర్పించడానికి రాగా..ఆయనకు నిరసన సెగ ఎదురైంది. ‘గో బ్యాక్ KTR’ అంటూ సాయిబాబా అభిమానులు, కామ్రేడ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదేళ్లుగా సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు BRS ఏం చేసిందని ప్రశ్నించారు. నిరసనల నేపథ్యంలోనే కేటీఆర్..సాయిబాబా కు నివాళ్లు అర్పించి.. అక్కడి నుంచి వెనుదిరిగారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్, బాల్క సుమ‌న్, ప‌ల్లె ర‌వి కుమార్, తుల ఉమ‌తో పాటు ప‌లువురు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం బాధాకరం అని కేటీఆర్ పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశంలోని ప్రజా ఉద్యమాలకు ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు అని పేర్కొన్నారు.

Read Also : Cameron Green: భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు బ్యాడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GN Sai Baba
  • GN Saibaba Died
  • ktr
  • ktr pay tributes
  • Protest KTR
  • Saibaba dead body

Related News

Phone Tapping Santhosh

ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు

    Latest News

    • కశ్మీర్‌లో భూకంపం

    • జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

    • ఇండియన్ నేవీలో 260 పోస్టులు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

      • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

      • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd