Promotions : తెలంగాణ లో సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సహా.. మరో ఐదుగురు అధికారులు డీజీపీలుగా ప్రమోషన్ పొందారు
- By Sudheer Published Date - 12:17 PM, Thu - 8 August 24

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పోలీస్ శాఖ (Police Department)లో అనేక మార్పులు , చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా IPS అధికారుల బదిలీలు , వేటులు పడుతుండగా..తాజాగా పలువురు IPS అధికారులకు ప్రమోషన్స్ (Promotions ) దక్కాయి. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సహా.. మరో ఐదుగురు అధికారులు డీజీపీలుగా ప్రమోషన్ పొందారు. డీజీపీలుగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి , సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, అభిలాష బిస్తీలకు ఉద్యోగన్నతి లభించింది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి డీజీగా.. హైదరాబాద్ నగర సీపీగా కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, సీఐడీ చీఫ్ షికా గోయల్ పనిచేస్తున్నారు. వారు అవే స్థానాల్లో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె వారం క్రితం.. పలువురు నాన్-క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగిచింది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ ఎస్పీ ఏ రమణా రెడ్డిని.. ఎస్ఓటీ ( మల్కాజ్‌గిరి, రాచకొండ, భువనగిరి )కి డీసీపీగా బదిలీచేసింది. హైదరాబాద్ నగర మహిళల భద్రతా విభాగం డీసీపీగా ఉన్న దార కవితను సైబర్ క్రైమ్ విభాగానికి డీసీపీగా పంపింది. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర్లుకు ఆక్టోపస్ (అడ్మిన్) ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది.
Read Also : Indian Roadmaster Elite: ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 మాత్రమే ఉన్న ఈ బైక్స్ ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా?