HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Praveen Kumar Fires On Chandrababu And Pawan Kalyan

R. S. Praveen Kumar : చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ పై ప్రవీణ్ కుమార్ ఫైర్

R. S. Praveen Kumar : సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని పేర్కొంటూ ఆయన్ను సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది

  • Author : Sudheer Date : 03-03-2025 - 1:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rspraveencbn
Rspraveencbn

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ (PV Sunil Kumar Suspend) వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. చంద్రబాబు నాయుడు (Chandrababu)నేతృత్వంలోని ఏపీ కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని పేర్కొంటూ ఆయన్ను సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో స్పందించారు.

సునీల్ కుమార్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తగిన అనుమతులు తీసుకుని విదేశాలకు వెళ్లినా, ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త నిబంధనలు అమలు చేసినట్లు వ్యవహరించడం తగదని విమర్శించారు. గతంలో ప్రభుత్వమే ఆయనకు ఎక్స్-ఇండియా లీవ్ మంజూరు చేసిందని, అయితే ఇప్పుడు ఆ అనుమతిని లెక్కచేయకుండా సస్పెన్షన్ విధించడం అన్యాయమని తెలిపారు. దీని వెనుక అసలు ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ అధికారులను ఎదగనివ్వకుండా చేయడమేనని ఆరోపించారు.

Galwan Clash: భారత సైనికుల దెబ్బతో కోమాలోకి.. ఆ చైనీయుడికి వరుస సత్కారాలు

ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలు, టూర్ షెడ్యూళ్ల విషయంలో అసమానతలు ఉన్నాయని, ముఖ్యంగా దావోస్ పర్యటనల విషయంలో ప్రభుత్వ పెద్దల వైఖరిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అధికారుల వ్యక్తిగత ఖర్చుతో విదేశాలకు వెళ్లడాన్ని తప్పుపట్టడం వెనుక ఎస్సీ, ఎస్టీ వర్గాలపై కొనసాగుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎస్సీలు, ఎస్టీలు విమానయాన ప్రయాణాలు చేయకూడదా? వారి పిల్లలు విదేశాల్లో చదువుకోకూడదా? అనే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు.

అంతేకాక, హోంమంత్రిగా ఉన్న ఎస్సీ వర్గానికి చెందిన అనిత ఈ అన్యాయంపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అలాగే, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా మౌనం పాటించడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆదుకుంటామంటూ ఓట్లు దండుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిజానికి ఈ వర్గాల హక్కులను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. సునీల్ కుమార్‌ను కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో సునీల్ కుమార్ వ్యవహారం మరింత రాజకీయ రగడకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Pawan Kalyan
  • Praveen Kumar fires
  • PV Sunil Kumar Suspend

Related News

Meeting Of CMs

India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd