KA PAUL : ఈవీఎంలు పనిచేస్తాయా లేదా చూడటానికి వచ్చా…!!
- Author : hashtagu
Date : 03-11-2022 - 9:17 IST
Published By : Hashtagu Telugu Desk
మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు నెమ్మదిగా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరుతున్నారు. మునుగోడు ప్రజల చేతిలోనే 47మంది అభ్యర్థుల భవిష్యత్ ఉంది. అభ్యర్థుల భవిత్యం ఓటు రూపంలో ఈవీఎంలలో భద్రంగా ఉంది.
కాగా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ఎన్నికలంటే ఈవీఎంలు మొరాయిస్తుంటాయి కదా. మరి ఇక్కడ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడటానికి వచ్చాను. పోలింగ్ ఏర్పాట్లు కూడా చూశాను. పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మునుగోడు ప్రజలకు చాలా తెలివి ఉంది. వారికి తెలుసు ఎవరి ఓటు వేయాలన్నది. ఎవరైతే న్యాయం చేస్తారో వారికే ఓటు వేస్తారు. వారి నియోజకవర్గం డెవలప్ చేసేదో ఎవరో వారికి బాగా తెలుసు. తమ ఓటుతోనే సరైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాంటూ…ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కేఏ పాల్ కోరారు.