POWERHOUSE Interview : మరో ‘పవర్’ ను ఇంటర్వ్యూ చేయబోతున్న TV9 రజనీకాంత్
రీసెంట్ గా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలువగా..ఇప్పుడు మరో వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు
- By Sudheer Published Date - 12:10 PM, Wed - 1 May 24
TV9 రజనీకాంత్..మరో ట్వీట్ చేసి ఉత్కంఠ కు తెరలేపారు. రీసెంట్ గా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలువగా..ఇప్పుడు మరో వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.
BIG ALERT 🔥 #BigBrotherOnTV9
Get ready to witness a
POWERHOUSE interview on
@TV9Telugu
💥
Tune in and catch the
BIG BROTHER in ACTION🌋
Any guesses who’s taking the hot seat?⚡
Stay tuned!
అంటూ ట్వీట్ చేసి అందరిలో అటెన్షన్ పెంచారు. రజని..ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరై ఉంటారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బిగ్ బ్రదర్..పవర్ హౌస్ అంటూ చెప్పడం తో పవన్ కళ్యాణ్ లేదా మెగాస్టార్ చిరంజీవి ని ఏమైనా ఇంటర్వ్యూ చేయబోతున్నారా..? అని అంత అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా చిరంజీవి.. ఏపీలోని కూటమి పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు వీడియోస్ రిలీజ్ చేసి తమ్ముడు పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు బిజెపి , జనసేన నేతలను గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో రజనీకాంత్ ఇంటర్వ్యూ లో చిరంజీవి ఏమైనా పాల్గొంటున్నారా..? అని మెగా అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రచారం లో బిజీ బిజీ గా ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ కు వచ్చే సమయం లేదు..కనుక చిరంజీవే అయ్యి ఉంటారని అంత అనుకుంటున్నారు. చూద్దాం ఎవర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారో..
ఇక కేసీఆర్ ఇంటర్వ్యూ కు వస్తే..దాదాపు 12 ఏళ్ల తర్వాత కేసీఆర్ టీవీ చర్చ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో రజని అడిగిన అనేక ప్రశ్నలకు సమాదానాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణాలు..? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్..? కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల ఆరోపణలపై..? ఫోన్ ట్యాపింగ్..? బిఆర్ఎస్ నేతలు పార్టీని వీడడం ఫై..ఇలా అనేక ప్రశ్నలకు సమాదానాలు చెప్పి ప్రజలకు ఆకట్టుకున్నారు. దాదాపు నాల్గు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం..యూట్యూబ్ లో సంచలన వ్యూస్ సాధించి టీవీ 9 రికార్డు లో నిలిచింది. మరి ఇప్పుడు రజని చేయబోయే వ్యక్తి ఎవరో..? అది ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో ..? చూడాలి.
BIG ALERT 🔥 #BigBrotherOnTV9
Get ready to witness a
POWERHOUSE interview on @TV9Telugu 💥Tune in and catch the
BIG BROTHER in ACTION🌋Any guesses who's taking the hot seat?⚡
Stay tuned!#AndhraPradesh #Telangana #LokasabhaElection2024
— Rajinikanth Vellalacheruvu (@rajinikanthlive) May 1, 2024
Read Also : Covid Vaccines : మా కరోనా వ్యాక్సిన్ సురక్షితమైందే : ఆస్ట్రాజెనెకా
Related News
KCR TV9 Debate : టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనంపై కేసీఆర్ స్పష్టత..
ఈ డిబేట్ లో చాల విషయాలను గురించి కేసీఆర్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై చేస్తున్న ఆరోపణల ఫై ఆయన స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు..? తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది..? 24 గంటలు కరెంట్ బిఆర్ఎస్ ఇవ్వలేదా..? తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మాట ఎందు�