Ponnala Joins In BRS : కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన పొన్నాల..
45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్టపడినా తనకు ఫలితం దక్కలేదని అన్నారు. బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తానని, కాంగ్రెస్‌లో అవమానాలకు గురయ్యానని పొన్నాల తెలిపారు
- By Sudheer Published Date - 07:24 PM, Mon - 16 October 23

కాంగ్రెస్ మాజీ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah)..సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో బిఆర్ఎస్ (Ponnala Joins BRS) లో చేరారు. జనగామలో నిర్వహించిన భారీ బహిరంగ సభ (BRS Public Meeting at Jangaon)లో పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్ తీర్థం స్వీకరించారు. జనగామలో ప్రజా ఆశీర్వాద పేరుతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనగా.. ఈ సందర్భంగా ప్రజల సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం పొన్నాల (Ponnala Lakshmaiah Speech) మాట్లాడుతూ.. 45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్టపడినా తనకు ఫలితం దక్కలేదని అన్నారు. బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తానని, కాంగ్రెస్‌లో అవమానాలకు గురయ్యానని పొన్నాల తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూణ్నెళ్లల్లోపే సకలజనుల సర్వే చేసిన ఘనత కేసీఆర్‌ది అని, ఆ లెక్కల ప్రకారమే పార్టీలు ఎన్నికలకు వెళుతున్నాయని అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెలిపించుకోవాలని ప్రజలకు పొన్నాల పిలుపునిచ్చారు.
ఎన్నికల నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు కులగణనను తెరమీదకు తీసుకొస్తున్నాయని కానీ, కేసీఆర్ సీఎం అయిన 3 నెలలకే కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని తెలిపారు. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్ పార్టీలో చేరానన్నారు. జనగామ జిల్లాకు మరింత ప్రోత్సాహకం ఇవ్వాలని, పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
పొన్నాల ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో జనగామ సీటును ఆశించారు. కానీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో తనను అవమానించారని, బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు బిఆర్ఎస్ లో చేరారు. మరి జనగాం టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కేటాయించారు సీఎం కేసీఆర్. మరి పొన్నాలకు మారే ఏ పదవి ఇస్తారనేది చూడాలి.
Read Also : KCR Jangaon Public Meeting : జనగాం జిల్లా ఫై హామీల వర్షం కురిపించిన కేసీఆర్