అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయించింది. ఈమేరకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి చర్చలు జరిగినప్పటికీ.. కాంగ్రెస్ వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల (Telangana Polls) ప్రకటించారు.
Telangana Polls : 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్
Telangana Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
- Author : Pasha
Date : 30-10-2023 - 2:26 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ టైంను కుదించినట్లు తెలిపింది. ఆ 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని వెల్లడించింది. పోలింగ్ టైం కుదించిన సెగ్మెంట్లలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
ఓటరు జాబితాలో పేర్లున్న ఓటర్లందరికీ నవంబర్ 25కల్లా ఓటరు సమాచార స్లిప్‌లను ఎన్నికల సంఘం పంపిణీ చేయనుంది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఫొటోతో ఉన్న ఓటరు కార్డు లేదా మరో 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని పోలింగ్‌స్టేషన్‌కు తీసుకువెళ్లొచ్చు. పాస్‌పోర్ట్ ఉన్నవారికి అందులోని వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో నమోదైన ప్రవాస ఓటర్లను కూడా ఓటింగ్‌కు అనుమతిస్తారు. ఓటరు గుర్తింపు కార్డులలో దొర్లిన చిన్నచిన్న అక్షర దోషాలను పెద్దగా పట్టించుకోవద్దని ఎన్నికల అధికారులకు ఈసీ సూచించింది.