Political Civil Code : కాంగ్రెస్ వైపు KCR అడుగు
తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు (Political Civil Code) తిరుగుతోంది. ఎవరు ఎవరితో ఉంటారు? అనేది స్పష్టత వస్తోంది.
- By CS Rao Published Date - 01:01 PM, Tue - 11 July 23

తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు (Political Civil Code) తిరుగుతోంది. ఎవరు ఎవరితో ఉంటారు? అనేది స్పష్టత వస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. పార్లమెంట్ వేదికగా ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తో కలిసి మీటింగ్ పెట్టారు. పాత బస్తీ మెట్రో రైలుకు క్లియరెన్స్ ఇచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తే, రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు (Political Civil Code)
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా గత ఏడాది పెద్ద ఎత్తున కేసీఆర్ గళం విప్పారు. ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేశారు. దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల చీఫ్ లను కలుసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ అవసరమని తొలి రోజుల్లో ఆలోచించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లకుండా బీజేపీని దించేయలేమని అంచనా వేశారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు (Political Civil Code) ఇస్తూ పలు సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడారు.
లౌకిక పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ జత కట్టే అంశంపై
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టుక మీద ఒకానొక సమయంలో దుమ్మెత్తి పోసింది. ఆ సందర్భంలో రాహుల్ కు మద్ధతుగా కేసీఆర్ నిలిచారు. ఆదానీ గ్రూప్ లావాదేవీలపై అమెరికాకు చెందిన హిటెన్ బర్గ్ రిపోర్ట్ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని కాంగ్రెస్ పార్టీతో కలిసి బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీలతో కలిసి బీఆర్ఎస్ ఎంపీలు ధర్నాకు దిగారు. ఆదానీ, మోడీ బంధంపై పలు రకాల ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. అంతేకాదు, లౌకిక పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ జత కట్టే అంశంపై (Political Civil Code) కొన్ని రోజుల పాటు చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతల నుంచి రాష్ట్రంలోని జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై సానుకూలంగా మాట్లాడారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుకు సంకేతాలు
భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయాలని చత్తీగడ్ వేదికగా జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలోనూ తీర్మానం చేశారు. ఆయా రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందన్న సంకేతం బలంగా ప్రజల మధ్యకు వెళ్లింది. ఎన్నికల వ్యూహకర్తగా ప్రాచుర్యం పొందిన ప్రశాంత్ కిషోర్ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుకు సంకేతాలు ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు (Political Civil Code) గురించి స్పష్టం చేశారు. సీన్ కట్ చేస్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయాలను మార్చేసింది.
Also Read : Asaduddin meet KCR : సీఎం కేసీఆర్‌తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ.. యూసీసీ కోడ్‌పై కేసీఆర్ కీలక నిర్ణయం ..
లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ ఖాయమని ప్రచారం బలంగా జరిగింది. ఆమెను సీబీఐ, ఈడీ విచారించిన తీరును గమనిస్తే కేంద్రంతో కేసీఆర్ కు ఉన్న బంధాన్ని తెలియచేసింది. పైగా విచారణ తరువాత కవితకు క్లీన్ చిట్ లభించింది. ఈ ఎపిసోడ్ తరువాత బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం నమ్ముతోంది. అదే విషయాన్ని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. దానికి బలం చేకూరేలా ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఆరోపణల పర్వం తగ్గింది. అధికారంలోకి తీసుకురావాలని బీజేపీని దూకుడుగా తీసుకెళుతోన్న బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఈ పరిణామాలు బీజేపీ, బీఆర్ఎస్ ఫిక్సింగ్ పాలిటిక్స్ కు నిదర్శనంగా కాంగ్రెస్ చెబుతోంది.
పలు రకాలుగా మారుతూ వస్తోన్న తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి బిల్లు వద్ద.(Political Civil Code) ఆగింది. దానికి వ్యతిరేకంగా ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ వైపు కేసీఆర్ అడుగులు పడుతున్నాయని భావించాలి. వ్యతిరేకంగా ఓటేస్తే, ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా బీఆర్ఎస్ మారుతుందని అనుకోవాలి. బిల్లు పార్లమెంట్లో ఓటింగ్ కు వచ్చిన సందర్భంలో బహిష్కరించి బీఆర్ఎస్ ఎంపీలు వెళితే మాత్రం పరోక్షంగా బీజేపీకి అండగా ఉన్నట్టు భావించాలి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి లిట్మస్ టెస్ట్ మాదిరిగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఉంది. దాని ఆమోదం తరువాత తెలంగాణ రాజకీయాలకు ఒక స్పష్టత రానుంది. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ వైపు కేసీఆర్ అడుగులు పడుతున్నాయని స్పష్టమవుతోంది.