Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు
Drugs : ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో ఈ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. ఈ డ్రగ్స్ తయారీ కేంద్రం నుండి సుమారు రూ. 12వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ మరియు 32వేల లీటర్ల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు
- By Sudheer Published Date - 04:10 PM, Sat - 6 September 25

హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ జిల్లాలో భారీ డ్రగ్స్ (Drugs ) తయారీ కేంద్రం బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో ఈ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. ఈ డ్రగ్స్ తయారీ కేంద్రం నుండి సుమారు రూ. 12వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ మరియు 32వేల లీటర్ల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ ఫ్యాక్టరీలలో ఇది ఒకటని అధికారులు వెల్లడించారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మొదట ముంబైలో ఒక డ్రగ్స్ సరఫరా ముఠాను పట్టుకున్నారు. వారి విచారణలో హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా ముంబై పోలీసులు హైదరాబాద్ చేరుకుని, స్థానిక పోలీసుల సహాయంతో మేడ్చల్ జిల్లాలోని ఆ ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ లేబుల్స్ తో రసాయన పరిశోధనల పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అసలు రోజుకు ఎన్ని తినవచ్చు..?
ఈ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ వెనుక ఒక అంతర్జాతీయ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు, ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠా యొక్క ప్రధాన లక్ష్యం యువతను టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు జరపడమేనని తేలింది.
ఈ భారీ డ్రగ్స్ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు బయట పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుల నుండి మరిన్ని కీలక సమాచారాలు సేకరించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దేశంలోని డ్రగ్స్ సమస్యను నిరోధించడానికి ఇలాంటి ఆపరేషన్లు చాలా అవశ్యకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.