HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Performance Of Tribal Students In Jee Advanced Results

Tribal Students: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా చాటిన గిరిజన విద్యార్థులు!

గతంలో ఎన్నడు లేని విధంగా వందలోపు ర్యాంకులు సాధించి గిరిజన విద్యార్థులు వారి ప్రతిభ కనబరిచడం హర్షణీయమని మంత్రి అన్నారు.

  • Author : Balu J Date : 19-06-2023 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు సత్తా చాటారాని రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ఈ ఏడాది ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు డైరెక్ట్ కేటగిరీలో 101 మంది విద్యార్థులు మరియు ప్రిపరేటరీ కేటగిరీలో 118 మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రీమియర్ టెక్నలాజికల్ యూనివర్శిటీల ఐఐటీల్లో సీట్లు సాధించడం ఖాయంమన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ నుండి, 350 మంది విద్యార్థులకు IIT JEE అడ్వాన్స్డ్ – 2023 క్రాకింగ్ కోసం ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వటం జరిగిందని మంత్రి తెలిపారు. వీరిలో 101మందికి ప్రత్యక్ష సీట్లు మరియు 118 ప్రిపరేటరీ ర్యాంకులు వస్తాయని పేర్కొన్నారు.. రవి కుమార్ (CRL ర్యాంక్ 16711) మరియు నిత్య శ్రీ (CRL ర్యాంక్ 18287) PVTG కమ్యూనిటీలకు చెందినవారు, ఈ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని స్పష్టం మంత్రి చేశారు. 5 మంది విద్యార్ధులు ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకింగ్ 10,000 కంటే తక్కువ ర్యాంకులు సాధించారు మరియు దాదాపు కమ్యూనిటీ ర్యాంకింగ్ లో 24 మంది విద్యార్థులు 500 కంటే తక్కువ సాధించారు.

గతంలో ఎన్నడు లేని విధంగా వందలోపు ర్యాంకులు సాధించి గిరిజన విద్యార్థులు వారి ప్రతిభ కనబరిచడం హర్షణీయమని మంత్రి అన్నారు. వీరిలో సాయిచరణ్ 30 వ ర్యాంక్ సాదించగా, వెంకటేష్ 56, బోడ ప్రవీణ్ 63, బి వేణు 75, జె అజయ్ 77 లాలూ ప్రసాద్ 97 వ ర్యాంకు సాధించాలని తెలిపారు.గిరిజన గురుకుల విద్యార్థులు కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా సత్తా చాటారని మంత్రి అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతను ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి విద్యార్థులు సాధిస్తున్న ఈ ర్యాంకులే నిదర్శనం అన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో గిరిజన విద్యార్ధులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటి పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని, pvtgs విద్యార్థులు సైతం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఇంజనీరింగ్ , ఎంబీబీఎస్ విద్యలో ప్రవేశాలు పొందుతున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రికార్డు స్ధాయిలో గిరిజన విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించి, సత్తాచాటాడానికి కృషి చేసిన అధికారులను సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • JEE Advanced Results
  • Marks
  • Satyavathi Rathod
  • telangana
  • tribal students

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd