Pawan Kalyan : ఇవాళ వరంగల్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం
Pawan Kalyan : తెలంగాణలో బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్ జిల్లా నుంచి ప్రచార బరిలోకి దిగుతున్నారు.
- By Pasha Published Date - 07:08 AM, Wed - 22 November 23

Pawan Kalyan : తెలంగాణలో బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్ జిల్లా నుంచి ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ వెళ్తారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిని రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, ఆ తర్వాత దుబ్బాకలో పర్యటిస్తారు. ఆయా చోట్ల నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
బీజేపీతో పొత్తులో భాగంగా తెలంగాణలో 8 స్థానాలలో జనసేన పోటీ చేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూకట్‌పల్లి- ప్రేమ్‌కుమార్, తాండూరు-శంకర్‌గౌడ్, ఖమ్మం-రామకృష్ణ, కొత్తగూడెం-సురేందర్ రావు, వైరా-సంపత్ నాయక్, అశ్వారావుపేట- ఉమాదేవి, కోదాడ- సతీష్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో వంగ లక్ష్మణ్‌గౌడ్‌లను పోటీలో నిలిపింది. తమ అభ్యర్థులతో పాటు బీజేపీ అభ్యర్థుల తరపున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 25న తాండూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధి శంకర్‌గౌడ్‌కు మద్దతుగా, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్ధి ప్రేమ్‌కుమార్‌కు మద్దతుగా కూడా పవన్ ప్రచారం చేస్తారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. 2020లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పరోక్షంగా 48 స్థానాల్లో బీజేపీ గెలుపునకు పవన్ సహకరించారు. ఈసారి కూడా పవన్ సహకారంతో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో సీట్లను గెల్చుకోవచ్చనే వ్యూహంతో(Pawan Kalyan) బీజేపీ ఉంది.