Telangana : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డినే సీఎం – పరిగి కాంగ్రెస్ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డియే సీఎం అవుతారని అన్నారు. తెలంగాణలో యువత... రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారని
- By Sudheer Published Date - 07:54 PM, Wed - 8 November 23

కాంగ్రెస్ పార్టీ (Congress Party) శ్రేణులను ఓ ప్రశ్న మాత్రం ఎప్పటి నుండో మదిలో నుండి పోవడం లేదు..అదే సీఎం అభ్యర్థి ఎవరా అనేది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections ) ప్రచారం నడుస్తుంది. బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ సీఎం కేసీఆరే (KCR) అని చెపుతుంది..బిజెపి మాత్రం అధికారంలోకి వస్తే బీసీ నేతే సీఎం అని తేల్చి చెప్పింది. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..? అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు..? అనేది అందరి మదిలో ఉన్న ప్రశ్న. ప్రస్తుతం సీనియర్ నేతలంతా ఎవరికీ వారే మీమంటే మీమే అని చెపుతున్నారు. కొంతమందైతే సీఎం ఎవరనేది అధిష్టానం చూసుకుంటుందని చెపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి (Parigi Constituency Congress Candidate ) గా బుధువారం నామినేషన్ వేసిన రామ్మోహన్ రెడ్డి ( Ram Mohan Reddy)..అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డియే సీఎం అవుతారని అన్నారు. తెలంగాణలో యువత… రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారని , బీఆర్ఎస్‌తో రేవంత్ చేస్తున్న పోరాటం పట్ల ప్రజలు, యువత ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఇక పరిగి నియోజకవర్గంలో తాను ఎన్నో గ్రామాలను తిరిగానని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండెనని ప్రజలు చెప్పుకొచ్చారని , కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే, ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ చేసే రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందని రాంమోహన్ ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.
Read Also : Telangana Polls : జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్